Pushpa2: పుష్ఫ2 చిత్ర యూనిట్‌కు మెగా హీరో విషెస్.. బన్నీ రియాక్షన్ ఇదే..
ఇండియన్ సినిమా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చేస్తోంది. మరి కాసేపట్లో పుష్ప2 విడుదలకు సిద్ధమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా మరి కాసేపట్లో విడుదలవుతోన్న పుష్ప సినిమాకు విషెస్ చెబుతూ ప్రముఖులు ట్వీట్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా మెగా హీరో ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు..
పుష్ప2 సినిమా కోసం ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. కేవలం అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా యావత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం పుష్ప2 కోసం ఎంతో క్యూరియాసిటీతో ఉంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద పుష్ప రాజ్ సృష్టించబోయే సంచలనల కోసం అందరూ ఆసక్తిగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా మరికాసేపట్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
విడుదలకు ముందే ఏకంగా రూ. 100 కోట్లను రాబట్టిన పుష్ప2 ఇండియన్ సినిమా చరిత్రలోనే సరికొత్త అధ్యయనానికి తెర తీసింది. దీంతో పుష్ప సినిమాకు ఇండస్ట్రీకి చెందిన పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సైతం పుష్ప చిత్ర యూనిట్‌కు తన శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు.
Wishing all the best to the entire team of #Pushpa2TheRule.
Sending my heartfelt and blockbuster wishes to @alluarjun #Bunny , @aryasukku sir, #FahadhFaasil, @ThisIsDSP , @iamRashmika @resulp @SukumarWritings , @MythriOfficial , and the entire team. 🤗 pic.twitter.com/VMUb4GLvuu
— Sai Dharam Tej (@IamSaiDharamTej) December 4, 2024
పుష్ప2 పోస్టర్‌ను పోస్ట్ చేసిన సాయి ధరమ్ తేజ్.. ‘పుష్ప2 చిత్ర యూనిట్‌కు నా శుభాకాంక్షలు. అల్లుఅర్జున్, సుకుమార్ గారు, ఫాజిల్, దేవీశ్రీ, రష్మికతో పాటు నిర్మాణ సంస్థ మైత్రీకి తేజ్ శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్‌కు బన్నీ బదులిస్తూ రీ ట్వీట్ చేశారు. విషెస్ తెలిపిన తేజ్‌కు ధన్యవాదాలు తెలిపిన బన్నీ.. మీ అందరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుందని ధీమా వ్యక్తం చేశారు.
Thank you very much Teju . Thank you for your brotherly wishes 🖤 . I hope you all like the movie . Hugs !
— Allu Arjun (@alluarjun) December 4, 2024
ఇదిలా ఉంటే ఇప్పటికే పుష్ప2 చిత్రానికి సంబంధించి కొన్ని రివ్యూస్ వస్తున్నాయి. ప్రముఖ సినీ విమర్శకుడు ఉమైర్ సందు తన రివ్యూను ఎక్స్ వేదికగా షేర్ చేశారు. పుష్ప 2 సినిమా ఫస్ట్ రివ్యూ అంటూ ఈ సినిమా బ్లాక్ బస్టర్ పైసా వసూల్ ఎంటర్టైనర్ అంటూ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. అల్లు అర్జున్ అద్భుతమైన నటనతో అదరగొట్టారని, ఈ సినిమాతో అల్లు అర్జున్ ఇప్పుడు నంబర్ వన్ పాన్ ఇండియా స్టార్ హీరో అంటూ రాసుకొచ్చారు. ఈ సినిమా విషయంలో ఎవరు కూడా జలసీగా ఫీల్ అవ్వద్దు అని అందరూ సపోర్ట్ చేయాలని ట్వీట్‌లో పేర్కొన్నారు.
Oh damn, #RashmikaMandanna will make you Sexy & Horny during watching #Pushpa2. Her chemistry with #AlluArjun is WILDFIRE ! Her dialogues totally Paisa Vasool specially in First Half. #Pushpa2 has Repeat Value. Public will LOVE this Mass STORM ! BLOCKBUSTER on the way. 🌟🌟🌟🌟 pic.twitter.com/rXOyMsBte9
— Umair Sandhu (@UmairSandu) December 3, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..