AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఆ రోడ్డుపై వాహనం నడపాలంటే హడల్‌.. నరకంగా మారిన ప్రయాణం, ఎక్కడంటే..

ఆ రోడ్డుపై ప్రయాణం అంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. కొన్ని కారణాల వల్ల రోడ్డు విస్తరణ పనులు ఆగిపోయాయి. హైదరాబాద్‌ పోలీస్‌ అకాడమి నుంచి మన్నగూడ వరకు ప్రయాణించాలంటేనే వాహనదారుల వెన్నులో వణుకు పుట్టేలా ఉంది. నరకంగా మారిన ఈ రోడ్డు ప్రయాణం గురించి ప్రత్యేక కథనం..

Telangana: ఆ రోడ్డుపై వాహనం నడపాలంటే హడల్‌.. నరకంగా మారిన ప్రయాణం, ఎక్కడంటే..
Road Winding
Peddaprolu Jyothi
| Edited By: Narender Vaitla|

Updated on: Dec 04, 2024 | 5:44 PM

Share

ఆ రహదారిపై వాహనం నడపాలంటేనే హడల్. చిన్న రోడ్డు.. పెరిగిన వాహనాలు.. వేగంగా వెళ్ళాలని చూసినా.. ఓవర్ టేక్ చేయాలని ప్రయత్నించిన అంతే సంగతి. నిత్యం ఆ రోడ్డుపై రక్తం పారుతోంది. రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. ఈ రోడ్డుపై ప్రమాదాలకు కారణమేంటి ? ఆ రహదారిపై వాహనం నడపడం ఎందుకంత కష్టం ? లాంటి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

హైదరాబాద్ నుంచి కర్ణాటక వెళ్ళే మార్గం.. మన్నెగూడ నుంచి బీజాపూర్ వరకు రోడ్డు విస్తరణ పనులు పూర్తయ్యాయి. పోలీస్ అకాడమీ నుంచి మన్నేగూడా వరకు 45 కిలోమీటర్లు. చాలా రోజులుగా రోడ్ వైడనింగ్ వర్క్స్ పెండింగ్ లో ఉంది. రోడ్డుకు అటు ఇటుగా ఉన్న చెట్లను నరకవద్దని గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు కొనసాగింది. ఈ కారణంగా రోడ్డు విస్తరణ పనులు ఆగిపోయాయి. దీంతో హైదరాబాద్ పోలీస్ అకాడమి నుంచి మన్నెగూడ వెళ్లేవరకు ఇరుకు రోడ్డులో డ్రైవింగ్ చేయడం వాహనదారులకు నరకంగా మారింది. ఈ మాత్రం ఏమరుపాటుగా ఉన్న రోడ్డు ప్రమాదం జరగడం ఖాయం.

ఒకరు కాదు.. ఇద్దరు కాదు..

గత వారం రోజుల వ్యవధిలో ఆరుగురు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. రోడ్డు విస్తరణ పనులు చేయాలని చాలా రోజులుగా స్థానికులు డిమండ్లు చేస్తున్న పాలకులు పట్టించుకోవడం లేదని విమర్శలున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు వెంటనే రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని చెవెల్లలో అన్ని పార్టీల నేతలు ఆందోళనకు దిగారు. ఇకనైనా రోడ్డు విస్తరణ పనులకు మోక్షం లభిస్తుందా ? లేదా ? అన్నది చూడాలి. అప్పా జంక్షన్ నుంచి చేవెళ్ల మండలం మన్నెగూడ వరకు NH-163 4-లైన్ల రహదారి 2017 సంవత్సరంలో మంజూరైంది అని చేవెళ్ల RDO చంద్రకళ తెలిపారు.

నాలుగు లైన్ల రహదారి కోసం 20 గ్రామాల్లో 337 ఎకరాల భూమి కోసం భూసేకరణ పూర్తయిందని..ఇప్పటికే పట్టాదార్లు,రైతులకు రూ. 135 కోట్లు చెల్లించారు అధికారులు. కానీ పర్యావరణ వేత్త కు సంబంధించిన ఓ వ్యక్తి 2021 లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో రోడ్ విస్తరణ పనులపై ఎన్జిటి స్టే ఇచ్చింది. ఎన్జిటి ఈ కేసును 2021లో క్లియర్ చేసింది. మళ్లీ మరోసారి అదే వ్యక్తి 2024లో రోడ్డు విస్తరణ పనులపై NGT లో స్టే తీసుకొచ్చారు.

కాగా ఈ కారణంతోనే రోడ్డు విస్తరణ పనులు ఆలస్యం అవుతూ వస్తున్నాయి అని RDO తెలిపారు. ఈనెల 16వ తేదీన ఎన్జీటీలో ఈ పిటిషన్ పై విచారణ ఉంది. ఈ నెలలో ఎన్జీటీ కేసు ముగించి రోడ్డు విస్తరణ పనులు చేపడతామని ప్రభుత్వం నుంచి ఏ సమస్య లేదు కాగా టెంపరరీగా రోడ్డు పనులు చేస్తున్నాము అని చేవెళ్ల ఆర్డీవో చంద్రకళ తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..