AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణలో పెరుగుతున్న ప్రీమెచ్యూర్ డెలవరీస్.. రీజన్స్ ఇవే..

కాలం మారింది. వేగం పెరిగింది. తల్లి కడుపులో శిశువులు 9 నెలల కాలం పూర్తిగా ఆగలేకపోతున్నారు. నెలలు నిండకుండానే భూప్రపంచాన్ని చూసేస్తున్నారు. ప్రీమెచ్యూర్ డెలవరీస్ కలవరపెడుతున్నాయి. ప్రీమెచ్యూర్ డెలవరీస్.. ఎందుకు పెరుగుతున్నాయి ? డాక్టర్లు చెబుతున్న రీజన్ ఏంటీ ? నెలలు నిండకుండానే జన్మిస్తున్న పిల్లల ట్రీట్మెంట్ పరిస్థితి ఏంటీ ?

Telangana: తెలంగాణలో పెరుగుతున్న ప్రీమెచ్యూర్ డెలవరీస్.. రీజన్స్ ఇవే..
Preterm Birth
Peddaprolu Jyothi
| Edited By: Ram Naramaneni|

Updated on: Dec 04, 2024 | 6:08 PM

Share

ఆధునిక జీవనశైలి ఎఫెక్ట్.. పుట్టబోయే పిల్లల మీద పడుతోంది. ప్రసవానికి ముందు గర్భిణిలు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో.. ప్రీమెచ్యూర్ డెలవరీస్ జరుగుతున్నాయి. తెలంగాణలో వాటి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రిలో ప్రతి వంద డెలివరీల్లో 25 మందికి ముందస్తు ప్రసవాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆస్పత్రి ప్రీమెచ్యూర్ డెలవరీ బేబీస్‌తో కిటకిటలాడుతోంది.

టెన్షన్ లైఫ్.. ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం.. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తదితర కారణాలు ప్రీమెచ్యూర్ డెలవరీస్‌కు కారణంగా చెబుతున్నారు వైద్యనిపుణులు. తెలంగాణలోని వివిధ జిల్లాల్లో డెలవరీస్ క్రిటికల్‌గా మారితే నీలోఫర్ ఆస్పత్రికి రెఫర్ చేస్తుంటారు. దీంతో క్లిష్టమైన కేసులకు ఇక్కడ ట్రీట్మెంట్ దొరుకుతుందనే ఆశతో చాలా మంది నీలోఫర్ ఆస్పత్రికి వస్తుంటారు. ప్రతినిత్యం వంద నుంచి నూట ముప్పై వరకు ప్రసవాలు జరిగితే.. అందులో కనీసం 25 మందికి పైగా ముందస్తు ప్రసవాలు జరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా శిశువు మూడు కేజీల బరువు ఉండాలి. ప్రీమెచ్యూర్ డెలవరీస్ కారణంగా శిశువులు చాలా సందర్భాల్లో కేజీ కంటే తక్కువ బరువుతో జన్మిస్తున్నారు. నెలలు నిండకుండా పుట్టడంతో వీరు చాలా వీక్‌గా, తక్కువ బరువుతో ఉంటారు. అంతేకాకుండా వీరు బ్రతకడం కూడా కష్టం అని కూడా చెబుతూ ఉంటారు డాక్టర్లు. ఇలా నెలలు నిండకుండా పుట్టిన పిల్లలు అనేక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా నెలలు నిండకముందే పుట్టిన శిశువులపై అదనపు సంరక్షణ అవసరం. వీరిపై ఎక్కువగా శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. ప్రీమెచ్యూర్ వల్ల వీరి శరీరం, లోపలు ఆర్గాన్స్ అభివృద్ధి చెందకపోవచ్చు. కాబట్టి వీరిలో న్యూరో డెవలప్‌మెంట్ అనేది అసాధారణంగా ఉంటుంది.

ప్రీమెచ్యూర్ బేబీస్‌ని పుట్టగానే వారిని వెంటిలేటర్‌ మీద పెడతారు. వెంటిలేటర్ నుంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత.. బిడ్డను తల్లి హత్తుకోవాలి. ఇలా చేయడం వల్ల తల్లి గుండె చప్పుడు, తల్లి స్పర్శను అనుభవించే వీలు ఉంటుంది. దీంతో బిడ్డ త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా శిశువును ఇన్‌ ఫెక్షన్లు, అలర్జీల నుండి కాపాడటం చాలా అవసరం. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించడం అవసరం. శిశువు ఊపిరి పీల్చుకుంటుందో కూడా పరిశీలిస్తూ ఉంటారు. నీలోఫర్ ఆస్పత్రిలో నెలలు నిండకుండానే పుట్టిన పిల్లల సంరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు.

కష్టసమయంలో వచ్చిన తమకు నీలోఫర్ ఆస్పత్రి పునర్జన్మను ఇచ్చిందని ట్రీట్మెంట్ తీసుకున్నవారు చెబుతున్నారు.ప్రీమెచ్యూర్ డెలవరీస్ కాకుండా ఉండాలంటే అనవరసర టెన్షన్లు పెట్టుకోకుండా కనీస జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. సో….. గర్భిణీలు ! టెన్షన్ పెట్టుకోకండి !! పుట్టబోయే బిడ్డ 9 నెలల కాలం మీ కడుపులో పెరిగేట్లు చూసుకోండి !!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..