AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Triumph scrambler 400x: ఏడాది చివరిలో స్క్రాంబ్లర్ బైక్ పై అదిరే ఆఫర్.. కీలక ప్రకటన చేసిన కంపెనీ

దేశంలో పండగల సీజన్ ముగిసింది. వివిధ రకాల ఆఫర్లు, డిస్కౌంట్లతో కళకళలాడిన మార్కెట్ నెమ్మదించింది. పండగలు వెళ్లిపోవడంతో ఆఫర్లు కూడా తగ్గిపోయాయి. 2024 కూడా దాదాపు నెల రోజుల్లో ముగిసిపోతుంది. ఇలాంటి సమయంలో బ్రిటీష్ కంపెనీ ట్రయంఫ్ శుభవార్త చెప్పింది. తన మోడల్ స్కూటర్ పై ఇయర్ ఎండ్ ఆఫర్ ను తీసుకువచ్చింది.

Triumph scrambler 400x: ఏడాది చివరిలో స్క్రాంబ్లర్ బైక్ పై అదిరే ఆఫర్.. కీలక ప్రకటన చేసిన కంపెనీ
Triumph Scrambler 400x
Nikhil
|

Updated on: Dec 04, 2024 | 5:30 PM

Share

దీపావళి సమయంలో కొత్త వాహనాన్ని కొనుగోలు చేయని వారికి ఇదే మంచి అవకాశం. ట్రయంఫ్ కంపెనీ భారతీయ బజాజ్ తో కలిసి రూపొందించిన స్క్రాంబ్లర్ 400 ఎక్స్ మోడల్ పై ఈ ఆఫర్ ఉంది. దీనిలో భాగంగా దాదాపు రూ.12,500 విలువైన యాక్సెసరీలను అందిస్తోంది. డిసెంబర్ చివరి వరకూ మాత్రమే ఈ అవకాశం ఉంది. స్క్రాంబ్లర్ 400 ఎక్స్ మోటారు సైకిల్ ను డిసెంబర్ లో కొనుగోలు చేసిన వారికి రూ.12,500 విలువైన యాక్సెసరీలు అందిస్తారు. వీటిలో కోటెడ్ విండ్ స్కీన్, హై మడ్ గార్డ్, లగేజ్ ర్యాక్ కిట్ తో పాటు ట్యాంక్ ప్యాడ్ ఉంటాయి. అదనంగా ట్రయంఫ్ టీ షర్టును కూడా పొందవచ్చు.

ట్రయంఫ్ బైక్ ఆఫ్ రోడ్ రైడింగ్ కు చాలా అనుకూలంగా ఉంటుంది. దీనిలో 398.15 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఏర్పాటు చేశారు. దాని నుంచి 39.5 బీహెచ్ పీ పవర్, 37.5 ఎన్ ఎం టార్కు విడుదల అవుతుంది. ఇంజిన్ కు 6 స్పీడ్ గేర్ బ్యాక్స్ జత చేశారు. అలాగే ఈ మోడల్ ప్లాట్ ఫాం ఆధారంగా రూపుదిద్దుకున్న స్పీడ్ 400 లో కూడా ఇదే ఇంజిన్ ఆప్షన్ ఉంది. అన్ని రకాల రోడ్లపై స్క్రాంబ్లర్ 400 ఎక్స్ చాలా సులభంగా పరుగులు తీస్తుంది. బైక్ ముందు భాగంలో 43 మిమీ అప్ సైడ్ డైన్ ఫోర్కులు, వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ అమర్చారు. ముందు చక్రం 19, వెనుక చక్రం 17 అంగుళాలు ఉంటుంది. ప్రయాణ సమయంలో వేగాన్ని అదుపు చేసేందుకు ముందు, వెనుక భాగాలలో డిస్క్ బ్రేక్ సెటప్ ఉంది. బ్లాక్ / సిల్వర్ ఐస్, మాట్ ఖాకీ గ్రీన్ / ప్యూజన్ వైట్, కార్నివాల్ రెడ్ / ఫాంటమ్ బ్లాక్ రంగులలో విడుదలైంది. ఇటీవలే పెరల్ మెటాలిక్ వైట్ అనే కొత్త రంగులో పరిచయం చేశారు.

ట్రయంఫ్ కంపెనీ నుంచి విడుదలైన స్క్రాంబ్లర్ 400 ఎక్స్ , స్పీడ్ 400 మోటారు సైకిళ్ల మధ్య కొన్నితేడాలున్నాయి. స్క్రాంబ్లర్ 400 ఎక్స్ బైక్ హెడ్ లైట్ గ్రిల్, బార్ ఎండ్ లకు బదులుగా సాధారణ అద్దాలు, నకిల్ గార్డులు, బాష్ ప్లేట్లు, విగ్జాస్ట్, ఫ్రంట్ వీల్ తో అందుబాటులోకి వచ్చింది. సస్పెన్షన్ మెరుగ్గా ఉంటుంది. రైడర్లకు ఉపయోగపడేలా డ్యూయల్ చానల్ ఏటీఎస్ సిస్టమ్ ఉంది. ఇయర్ ఎండ్ ఆఫర్ తో దీని కొనుగోళ్లు భారిగా పెరిగే అవకాశం ఉందని కంపెనీ భావిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి