PM Kisan: పీఎం కిసాన్‌ 19వ విడత ఎప్పుడు వస్తుందో తెలుసా? దరఖాస్తు చేయడం ఎలా?

PM Kisan: కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. కేంద్ర ప్రవేశపెట్టిన పథకాలలో పీఎం కిసాన్‌ స్కీమ్‌ ఒకటి. ఇందులో ప్రతి ఏడాది రైతులకు రూ.6000 చొప్పున వారి ఖాతాలో జమ చేస్తోంది కేంద్రం..

PM Kisan: పీఎం కిసాన్‌ 19వ విడత ఎప్పుడు వస్తుందో తెలుసా? దరఖాస్తు చేయడం ఎలా?
Follow us
Subhash Goud

|

Updated on: Dec 04, 2024 | 3:10 PM

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 19వ విడత అందుకునేందుకు చాలా మంది లబ్ధిదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రైతుల ఆధార్ లింక్డ్ బ్యాంక్ ఖాతాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డిబిటి) ద్వారా సంవత్సరానికి రూ. 6,000 మూడు సమాన వాయిదాలలో జమ చేస్తోంది కేంద్రం. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) ఫిబ్రవరి 2, 2019న ప్రారంభించారు. 19వ విడత 2025 ఫిబ్రవరి మొదటి వారంలో పంపిణీ చేసే అవకాశం ఉంది.

ఈ  ‘పథకం కింద అర్హులైన వ్యవసాయ కుటుంబాలకు ప్రతి నాలుగు నెలలకు రూ.2,000 చొప్పున మూడు సమాన వాయిదాలలో రూ.6,000 అందజేస్తున్నారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) సిస్టమ్‌ని ఉపయోగించి డబ్బు నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలకు పంపుతోంది.

పీఎం కిసాన్ కోసం ఓటీపీ ఆధారిత eKYCని ఎలా పూర్తి చేయాలి?

ఇవి కూడా చదవండి

ఓటీపీ-ఆధారిత eKYCని పూర్తి చేయడానికి రైతులకు వారి ఆధార్ ఖాతాకు లింక్ చేసిన మొబైల్‌ నంబర్‌ అవసరం. రాబోయే వాయిదాల గురించి సమాచారాన్ని పొందడానికి పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో ఈ మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేయడం కూడా చాలా ముఖ్యం. రైతులు పీఎం కిసాన్‌ మొబైల్ యాప్‌ని ఉపయోగించి కేవైసీని పూర్తి చేయవచ్చు. యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది రైతులు తమ eKYCని ఇంట్లో కూర్చొని పూర్తి చేయడానికి వీలు కల్పిస్తుంది. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా ఎలాంటి OTP లేదా వేలిముద్రను ఉపయోగించకుండా మీ ముఖాన్ని స్కాన్ చేయడం ద్వారా పని పూర్తి చేసుకోవచ్చు.

PM కిసాన్ యోజన కోసం ఎలా నమోదు చేసుకోవాలి?

  • రైతులు ఇప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవడం ద్వారా ఈ పని పూర్తి చేసుకోవచ్చు.
  • pmkisan.gov.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
  • ‘కొత్త రైతు నమోదు’ చేసుకునే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  • మీ ఆధార్, ఫోన్ నంబర్, బ్యాంక్ ఖాతా సమాచారాన్ని అందించండి.
  • భూమి యాజమాన్య రుజువు, బ్యాంక్ పాస్‌బుక్ వంటి ఏవైనా సంబంధిత పత్రాలను అప్‌లోడ్ చేయండి.
  • ధృవీకరణ కోసం మీ దరఖాస్తును సమర్పించండి.
  • ధృవీకరించిన తర్వాత ఆర్థిక సహాయం నేరుగా లబ్ధిదారుడి బ్యాంక్ ఖాతాకు పంపుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి