Autopay Cancellation: నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్ నెలనెలా డబ్బులు కట్ చేస్తున్నాయా? అయితే ఇలా ఆపేయండి!
Autopay Cancellation: మీ నెట్‌ఫ్లిక్స్, డిస్నీ హాట్‌స్టార్ ఖాతాలో ఆటో పేమెంట్ ఆప్షన్‌ను ఎంచుకోకపోతే మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ అంతట మీరే పేమెంట్ చేస్తే తప్ప మీ అకౌంట్ నుంచి మనీ కట్ అవ్వదు..
Netflix Hotstar Subscription: చాలా మంది ఓటీటీల్లో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూసే అలవాటు ఉంటుంది. అయితే చాలా మంది నెట్‌ఫ్లిక్స్, డిస్నీ హాట్‌స్టార్‌లకు సబ్‌స్క్రయిబ్ చేసుకుంటారు. ప్రతి నెల డబ్బులు కట్ అవుతూనే ఉంటాయి. కానీ చాలా మంది సమయం లేని కారణంగా ఎక్కువగా ఉపయోగించరు. వీటికి అటో డెబిట్ కారణంగా అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతూనే ఉంటాయి. అటో డెబిట్ కారణంగా నెలనెల డబ్బులు కట్ కావడం వల్ల వృథా అవుతుంది. మీ సబ్‌స్క్రిప్షన్ ఆటో రెన్యూ మోడ్‌లో ఉన్నప్పుడు ఇది ఎక్కువగా జరుగుతుంది. కానీ ఇప్పుడు దీన్ని నియంత్రించడం చాలా సులభం. దీని కోసం మీరు మీ సబ్‌స్క్రిప్షన్‌ను మాన్యువల్‌గా క్యాన్సిల్ చేయాలి. దీని ద్వారా మీరు ఖాతా నుంచి అటో డెబిట్ కాకుండా చేసుకోవచ్చు.
మీ నెట్‌ఫ్లిక్స్, డిస్నీ హాట్‌స్టార్ ఖాతాలో ఆటో పేమెంట్ ఆప్షన్‌ను ఎంచుకోకపోతే మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ అంతట మీరే పేమెంట్ చేస్తే తప్ప మీ అకౌంట్ నుంచి మనీ కట్ అవ్వదు.
ఆటో రెన్యూ ఆప్షన్‌ను ఎలా ఆఫ్ చేయాలి?
- ముందుగా నెట్‌ఫ్లిక్స్, డిస్నీ హాట్‌స్టార్‌లకు లాగిన్ అవ్వండి.
- ఇక్కడ ప్రొఫైల్‌కి వెళ్లి సబ్‌స్క్రిప్షన్ లేదా అకౌంట్ ఆప్షన్‌ని ఎంచుకోండి.
- ఆపై ఆటో రెన్యూ ఆప్షన్‌ను ఆఫ్ చేయండి. తద్వారా మీ సభ్యత్వం మరోసారి రెన్యూ అవ్వదు. మనీ కట్ అవ్వదు.
మెంబర్‌షిప్‌ను రద్దు చేయడం ఎలా?
ముందుగా మీ అకౌంట్‌ను లాగిన్ కావాలి. తర్వాత మేనేజ్ సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఇక్కడ సబ్‌స్క్రిప్షన్ క్యాన్సిల్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఒకవేళ మీరు ముందే క్యాన్సిల్ చేసినా ఆ సబ్‌స్క్రిప్షన్‌ను దాని వ్యాలిడిటీ ముగిసే వరకు వాడుకోవచ్చు. బ్యాంక్ అలర్ట్‌ను సెట్ చేసుకోండి. మీరు మీ బ్యాంక్ ఖాతాలో అలెర్ట్స్‌ను కూడా సెట్ చేయవచ్చు. మీ అకౌంట్ నుంచి మీకు తెలియకుండా ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగితే వెంటనే చర్యలు తీసుకోవడానికి సహాయం చేస్తుంది. మీ డెబిట్/క్రెడిట్ కార్డ్ వివరాలను ఎవరికీ షేర్ చేయకండి. మీరు సబ్‌స్క్రిప్షన్ నుండి డెబిట్/క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్‌ను తీసివేయవచ్చు. ఇది అవసరం లేని సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలను తీసేయడానికి మీకు సహాయం చేస్తుంది. దీని కారణంగా మీ అనుమతి లేకుండా డబ్బు డెబిట్ కావని గుర్తించుకోండి.
ఇది కూడా చదవండి: PM Kisan: పీఎం కిసాన్ 19వ విడత ఎప్పుడు వస్తుందో తెలుసా? దరఖాస్తు చేయడం ఎలా?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి