GST: జీఎస్టీలో కొత్తగా మరో శ్లాబ్‌.. కేంద్రం కీలక ప్రతిపాదన.. ఇక మరింత బాదుడు..!

GST: మీరు స్మోకరా.. టొబాకో ఉత్పత్తులేమైనా వాడతారా? పోనీ.. కార్లు, కాస్ట్‌లీ డ్రస్‌లు, కాస్మొటిక్స్‌ ఇష్టపడతారా? అయితే ఈ న్యూస్ మీకోసమే! కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. జీఎస్టీ విషయంలో మరో ముందుడుగు వేసింది. కొత్తగా మరో శ్లాబ్‌ను తీసుకువచ్చే ఆలోచనలో ఉంది..

GST: జీఎస్టీలో కొత్తగా మరో శ్లాబ్‌.. కేంద్రం కీలక ప్రతిపాదన.. ఇక మరింత బాదుడు..!
Follow us
Subhash Goud

|

Updated on: Dec 04, 2024 | 2:10 PM

జీఎస్టీలో కొత్తగా మరో శ్లాబ్‌ను తెచ్చే యోచనలో ఉంది కేంద్రం. సిన్‌ ప్రొడక్ట్స్ పేరుతో ఒక కేటగిరీని తయారుచేస్తుంది. ఈ  ప్రొడక్ట్స్‌పై కొత్తగా 35% జీఎస్టీ విధించేలా ప్రణాళికలు రూపొందిస్తుంది. తాజాగా జరిగిన జీఎస్టీ- గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌ భేటీలో ఈ మేరకు ప్రతిపాదనలు వచ్చారు. మరింత మేథోమథనం తర్వాత కౌన్సిల్‌కి ప్రపోజల్ పంపే అవకాశం ఉంది. ఈనెల 21న జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో దీనిపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

ఇక్కడే మీకో డౌట్ వచ్చి ఉంటుంది. సిన్ ప్రొడక్ట్స్ అంటే ఏంటీ అని. ఇందుకు ఉదాహరణగా సిగరెట్లు లాంటి పొగాకు ఉత్పత్తులు, కూల్‌డ్రింక్‌లను చెప్పుకోవచ్చు. ఇప్పటివరకూ వీటిపై 28% జీఎస్టీ అమలవుతోంది. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌ అభిప్రాయాలను కౌన్సిల్ ఓకే చెస్తే ఇకపై ఆ ఉత్పత్తులపై 35% జీఎస్టీ ఉంటుంది. ఈ శ్లాబ్ ఇప్పటివరకూ లేదు. సిన్‌ ప్రొడక్ట్స్‌ అని కేటగిరి తయారు చేసి దానికి ఈ ట్యాక్స్ అప్లై చెయ్యబోతున్నారు.

ఇక మిగతా శ్లాబుల్లోనూ కాస్త మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతానికి దేశంలో 5%, 12%, 18%, 28% చొప్పున నాలుగు రకాలుగా జీఎస్టీ ఉంది. తాజా మార్పుల జాబితాలో కాస్ట్‌లీ డ్రస్‌లు, కార్లు, షూస్‌, వాచ్‌లు లాంటివి ఉండబోతున్నాయి. ఉదాహరణకు ఇప్పటివరకూ మనం ఏ షర్ట్ కొన్నా దానికి 5% మాత్రమే జీఎస్టీ ఉంది. కానీ జీఎస్టీ కౌన్సిల్ ప్రతిపాదనల ప్రకారం.. చూస్తే 1500లోపు షర్ట్‌లకు 5% జీఎస్టీ ఉంటే, 15వందల నుంచి 10వేల లోపు షర్ట్‌లకు 18%, ఆపైన ధర ఉంటే 28% జీఎస్టీ ఉండబోతోంది. షూస్‌, కాస్మొటిక్స్‌, కార్లకూ ఇదే ఫార్ములా అప్లై చేయాలన్నది ప్రతిపాదన. ఈ సిన్‌ ప్రొడక్ట్స్‌లో లగ్జరీ ప్రొడక్ట్స్‌లో ఇంకా ఏమేం చేర్చుతారో వేచి చూడాలి.

కొంతలో కొంత గుడ్‌న్యూస్ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్‌ల విషయంలో కేంద్రం కాస్త సానుకూలంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ హెల్త్ ఇన్సూరెన్స్‌లపై 18% జీఎస్టీ ఉంది. ఇప్పుడు 5లక్షల లోపు ఇన్సూరెన్స్ తీసుకుంటే 5%కే జీఎస్టీ పరిమితం చేసే అవకాశం కనిపిస్తోంది. ఆపైన మాత్రం 18% కొనసాగొచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి