EPFO: ఇక ఏటీఎంల నుంచి పీఎఫ్‌ డబ్బు విత్‌డ్రా.. ఈపీఎఫ్‌వో ​​3.0 అంటే ఏమిటి? ప్రయోజనమేంటి?

EPFO: చాలా మంది ఈపీఎఫ్‌వో ​​ఉద్యోగులు 12 శాతం కంటే ఎక్కువ పెంచుకోవాలని భావిస్తుంటారు. కానీ పరిమితి కారణంగా అలా చేయలేకపోతున్నారు. అయితే ఈపీఎఫ్‌వో ​​3.0 ప్రారంభించిన..

EPFO: ఇక ఏటీఎంల నుంచి పీఎఫ్‌ డబ్బు విత్‌డ్రా.. ఈపీఎఫ్‌వో ​​3.0 అంటే ఏమిటి? ప్రయోజనమేంటి?
Follow us
Subhash Goud

|

Updated on: Dec 03, 2024 | 10:01 PM

ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత నిరంతర ఆదాయం కోసం వారి ఉపాధితో పాటు ఈపీఎఫ్‌వోలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఈపీఎఫ్‌వోలో పెట్టుబడి పెట్టిన మొత్తంలో కొంత భాగాన్ని పదవీ విరమణ తర్వాత పెన్షన్‌గా అందుకుంటారు. ఇప్పుడు ఈపీఎఫ్‌ఓ ​​నియమాలు మారవచ్చు. ఈ మార్పు తర్వాత పెట్టుబడిదారులు చాలా ప్రయోజనం పొందుతారు.

ఈపీఎఫ్‌వో 3.0ని తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇది అమలులోకి వచ్చిన తర్వాత ఈపీఎఫ్‌వో ​​నియమాలలో చాలా మార్పులు ఉంటాయి. ఈ మార్పుల తర్వాత పెట్టుబడిదారులు ప్రావిడెంట్ ఫండ్స్ నుండి ఉపసంహరించుకోవడం, పెట్టుబడి పెట్టడంలో మరింత సులభతరం కావచ్చు. ప్రస్తుతం ఉద్యోగులు తమ జీతంలో 12 శాతాన్ని మాత్రమే ఈపీఎఫ్‌కు చేరుతుంది. మీడియా నివేదికల ప్రకారం.. ఈపీఎఫ్‌వో ​​3.0 ప్రాజెక్ట్ అమలు చేస్తే ఉద్యోగులు తమ సహకారం వాటాను కూడా పెంచుకోవచ్చు. అంటే అతను 12 శాతం కంటే ఎక్కువ పెట్టుబడి పెంచుకోవచ్చు.

ఇది కూడా చదవండి: Telecom: అప్పుల్లో జియో, ఎయిర్‌టెల్‌, వీఐ.. షాకిస్తున్న కస్టమర్లు.. మరి బీఎస్‌ఎన్ఎల్‌..!

ఇవి కూడా చదవండి

చాలా మంది ఈపీఎఫ్‌వో ​​ఉద్యోగులు 12 శాతం కంటే ఎక్కువ పెంచుకోవాలని భావిస్తుంటారు. కానీ పరిమితి కారణంగా అలా చేయలేకపోతున్నారు. అయితే ఈపీఎఫ్‌వో ​​3.0 ప్రారంభించిన తర్వాత వారి కోరిక మేరకు పెట్టుబడి పెట్టవచ్చు. ప్రావిడెంట్ ఫండ్ నుండి పాక్షిక ఉపసంహరణలు చేయడంలో ఇబ్బంది ఎదుర్కొంటున్న వారి కోసం ఈపీఎఫ్‌వో ​​3.0 అమలు తర్వాత ఉద్యోగులు ఏటీఎంల ద్వారా ప్రావిడెంట్ ఫండ్ నుండి డబ్బును తీసుకోవచ్చు.

ఈ నిబంధన అమలులోకి వచ్చిన తర్వాత పీఎఫ్ ఖాతా నుంచి డబ్బును విత్‌డ్రా చేయడం సులభం అవుతుంది. మే-జూన్ 2025 నుంచి ఈ నిబంధన అమలులోకి రావచ్చని భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: BSNL Best Plan: బీఎస్‌ఎన్‌ఎల్‌లో రూ.100లోపు 5 అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్స్‌!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి