AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI: రూ.2000 నోట్లకు సంబంధించి ఆర్బీఐ కీలక అప్‌డేట్‌.. అదేంటో తెలుసా..?

RBI: గత ఏడాది మే 19న రూ.2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు మిగిలిన రూ.2000 నోట్లు బ్యాంకులకు చేరుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆర్బీఐ ఈ నోట్లపై కీలక ప్రకటన చేసింది..

RBI: రూ.2000 నోట్లకు సంబంధించి ఆర్బీఐ కీలక అప్‌డేట్‌.. అదేంటో తెలుసా..?
Subhash Goud
|

Updated on: Dec 03, 2024 | 3:45 PM

Share

గత ఏడాది రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి నోట్లు బ్యాంకులకు చేరుతూనే ఉన్నాయి. ఈ రెండు వేల రూపాయల నోట్లకు సంబంధించి కీలక అప్‌డేట్‌ ఇచ్చింది రిజర్వ్‌ బ్యాంక్‌. అందులో 100% రూ. 2,000 డినామినేషన్ నోట్లు ఇప్పటికీ బ్యాంకులో జమ కాలేదని పేర్కొంది. 2000 డినామినేషన్‌తో కూడిన 98.08 శాతం నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చినట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. ఇప్పుడు రూ.6,839 కోట్ల విలువైన నోట్లు మాత్రమే బ్యాంకులకు రావాల్సి ఉందని వెల్లడించింది. గత ఏడాది మే 19న రూ.2000 డినామినేషన్ బ్యాంకు నోట్లను చెలామణి నుంచి తొలగిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. మే 19, 2023 నాటికి చెలామణిలో ఉన్న రూ.2000 నోట్ల మొత్తం విలువ రూ.3.56 లక్షల కోట్లు అని సెంట్రల్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. నవంబర్ 29, 2024 నాటికి ఈ మొత్తం రూ.6,839 కోట్లకు తగ్గింది.

ఆర్బీఐ ఏం చెప్పిందంటే..

ఈ విధంగా మే 19, 2023 వరకు చెలామణిలో ఉన్న రూ.2000 నోట్లలో 98.08 శాతం తిరిగి వచ్చినట్లు ఆర్బీఐ తెలిపింది. రూ. 2,000 బ్యాంకు నోట్లను డిపాజిట్ చేసే లేదా మార్చుకునే సదుపాయం అక్టోబర్ 7, 2023 వరకు దేశంలోని అన్ని బ్యాంకు శాఖల్లో అందుబాటులో ఉంది. అయితే, ఈ నోట్లను మార్చుకునే సదుపాయం ఇప్పటికీ రిజర్వ్ బ్యాంకుకు చెందిన 19 ఇష్యూ కార్యాలయాల్లో అందుబాటులో ఉంది.

ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాలు అక్టోబర్ 9, 2023 నుండి వ్యక్తులు, సంస్థల నుండి రూ. 2,000 బ్యాంక్ నోట్లను వారి బ్యాంక్ ఖాతాలలో డిపాజిట్ చేయడానికి స్వీకరిస్తున్నాయి. ఇది కాకుండా, ప్రజలు దేశంలోని ఇండియన్ పోస్ట్ ద్వారా ఆర్బీఐ ఏదైనా ఇష్యూ కార్యాలయానికి కూడా రూ.2,000 నోట్లను పంపవచ్చు. ఈ డబ్బు వారి బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.

2000 రూపాయల నోట్లను ఎలా మార్చుకోవాలి?

అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలో 19 ఆర్బీఐ కార్యాలయాలు బ్యాంకు నోట్ల డిపాజిట్/మార్పిడిని అందిస్తున్నాయి. నవంబర్ 2016లో రూ.1,000, రూ. 500 బ్యాంకు నోట్లను చెలామణి నుండి తొలగించిన తర్వాత రూ. 2,000 బ్యాంకు నోట్లు జారీ చేసింది ఆర్బీఐ.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us