AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GST: రెడీమేడ్ దుస్తులపై జీఎస్టీ మోత.. పెరగనున్న ధరలు

GST: వస్తువులపై జీఎస్టీ రేట్లలో మార్పులను మంత్రుల బృందం జీఎస్టీ కౌన్సిల్‌కు ప్రతిపాదించగా, జీఎస్టీ కౌన్సిల్ దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది. మంత్రుల బృందం నివేదికపై..

GST: రెడీమేడ్ దుస్తులపై జీఎస్టీ మోత.. పెరగనున్న ధరలు
Subhash Goud
|

Updated on: Dec 03, 2024 | 3:01 PM

Share

Readymade Clothes: పెళ్లిళ్ల సీజన్‌లో కేంద్ర ప్రభుత్వం జనాలకు షాక్‌ ఇవ్వొచ్చు. డిసెంబర్ 21న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఉంది. బ్రాండెడ్ దుస్తులపై జీఎస్టీ పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటువంటి పరిస్థితిలో మీ వివాహం డిసెంబర్ నెల తర్వాత, మీరు ఇంకా పెళ్లికి బట్టలు కొనుగోలు చేయకపోతే ముందస్తుగా కొనడం మంచిది. ఎందుకంటే మీ జేబుపై మరింత భారం పడనుంది.

ప్రస్తుతం రెడీమేడ్ దుస్తులపై నాలుగు శ్లాబ్‌లలో వేర్వేరు జీఎస్టీ వసూలు చేయనున్నారు. ఇందులో పన్ను 5 నుండి 28 శాతం వరకు ఉంటుందని తెలుస్తోంది. డిసెంబర్ 21న జరిగే సమావేశం తర్వాత మంత్రుల బృందం (జిఓఎం) బ్రాండెడ్ రెడీమేడ్ వస్త్రాలపై పన్ను వసూళ్లను పెంచే అవకాశం ఉంది.

కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని 4 శ్లాబులుగా చేసినప్పటికీ, రెడీమేడ్ దుస్తులపై మాత్రం మూడు శ్లాబుల్లో జీఎస్టీ వర్తిస్తుంది. రూ.1,500 వరకు ఉన్న దుస్తులపై 5 శాతం జీఎస్టీ రూ. 1,500-10,000 మధ్య బట్టలపై 18 శాతం జీఎస్టీ, రూ.10,000 కంటే ఎక్కువ ఉన్న దుస్తులపై 28 శాతం జీఎస్టీ విధించనున్నారు.

రెడీమేడ్ దుస్తులపై ఇంత పన్ను:

ప్రస్తుతం మూడు స్లాబ్‌లలో రెడీమేడ్ దుస్తులపై జీఎస్టీ వర్తిస్తుంది. దీనికి సంబంధించి డిసెంబర్ 21వ తేదీన జరిగే జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోవచ్చు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో మంత్రుల బృందం రెడీమేడ్ దుస్తులపై పన్ను శ్లాబును పెంచే అవకాశం ఉంది. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో 5 శాతం పన్ను స్లాబ్‌ను తొలగించవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో డిసెంబర్ 21 తర్వాత రెడీమేడ్ దుస్తులపై 18 శాతం, 28 శాతం జీఎస్టీ పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

బ్రాండెడ్ దుస్తులపై 28 శాతం జీఎస్టీ:

ప్రస్తుతం బట్టల ధరలను బట్టి మూడు శ్లాబులుగా ప్రభుత్వం జీఎస్టీని వసూలు చేస్తోంది. అయితే డిసెంబర్ 21న జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ప్రభుత్వం బ్రాండెడ్ దుస్తులను 28 శాతం శ్లాబ్‌లో ఉంచవచ్చు. ఆ తర్వాత బ్రాండెడ్ దుస్తులు మునుపటి కంటే ఖరీదైనది కానుంది.

148 వస్తువులు ఖరీదైనవి కావచ్చు:

148 వస్తువులపై జీఎస్టీ రేట్లలో మార్పులను మంత్రుల బృందం జీఎస్టీ కౌన్సిల్‌కు ప్రతిపాదించగా, జీఎస్టీ కౌన్సిల్ దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది. మంత్రుల బృందం నివేదికపై డిసెంబర్ 21న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. కౌన్సిల్‌కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహిస్తారు. రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కూడా ఇందులో పాల్గొంటారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి