Bike Sale: అద్దిరిపోయే ఆఫర్.. ఐఫోన్ కంటే చీప్ ఈ బైక్.. లీటర్‌కి ఏకంగా 70కిమీ మైలేజ్
ఐఫోన్ కంటే చీప్ ఈ బైక్.. లీటర్‌కి ఏకంగా 70కిమీ మైలేజ్ ఇస్తుంది. తక్కువ బడ్జెట్‌లో మీరు ఇంటికి తెచ్చుకోవచ్చు. మరి ఆ బైక్ ఏంటి.? దాని ఫీచర్లు ఎంతో ఇప్పుడు తెలుసుకుందామా..
కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా.? తక్కువ బడ్జెట్ మాత్రమే కాదు.. ఎక్కువ మైలేజ్ కూడా ఇవ్వాలి. దీనికి తగ్గట్టుగానే చాలామంది బైక్‌ల కోసం వెతుకుతుంటారు. అలాంటివారి కోసం మేము ఓ ఆప్షన్ తీసుకోచ్చేశాం. మనం హీరో మోటోకార్ప్ సరికొత్త బైక్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది తక్కువ ధరలో లభించడమే కాదు, అద్భుతమైన మైలేజీని కూడా అందిస్తుంది. దీని కారణంగా ప్రతి ఒక్కరూ ఈ బైక్‌ను కొనేందుకు తెగ ఆసక్తిని చూపిస్తారు. మరి ఆ బైక్ ఏంటి అంటే.? Hero HF Deluxe. ఈ మోటార్ బైక్ ధర ఎంత.? ఒక లీటర్‌కు మైలేజ్ ఎంత ఇస్తుందో ఇప్పుడు తెలుసుకుందామా..
హీరో HF డీలక్స్ ధర
హీరో మోటోకార్ప్ అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ బైక్ బేస్ వేరియంట్ ధర రూ. 59 వేల 998(ఎక్స్-షోరూమ్). మీరు ఈ బైక్ టాప్ వేరియంట్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, దాని ధర రూ. 69,018(ఎక్స్-షోరూమ్)గా ఉంది.
హోండా షైన్ 100 ధర..
హోండా షైన్ 100 ఒక మోడల్ మాత్రమే అందుబాటులో ఉంది. దీని ధర రూ. 64 వేల 90(ఎక్స్-షోరూమ్)
హీరో HF డీలక్స్ vs హోండా షైన్ 100..
ఈ రెండింటి బైక్‌ల గురించి మాట్లాడితే.. హీరో HF డీలక్స్ బైక్‌లో 97.2 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ 7.9బిహెచ్‌పి పవర్, 8.05ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు, హోండా బైక్‌లో 99.7 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్ 7.6బిహెచ్‌పి పవర్, 8.05ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
మైలేజీ..
హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ మైలేజ్ గురించి మాట్లాడితే, నివేదికల ప్రకారం, ఈ బైక్ ఒక లీటర్‌కి 70 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుంది. హోండా షైన్ 100 బైక్ ఒక లీటర్ పెట్రోల్‌కి 55 నుంచి 65 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి