Pushpa 2: తగ్గేదేలే..! ఈ ఒక్క స్టాక్‌తో లక్షలే లక్షలు.. పుష్ప2 మూవీతో ఉన్న లింక్ ఇదే
ఈ ఒక్క స్టాక్‌కు.. పుష్ప 2 మూవీతో లింక్ ఉంది. రాత్రికి రాత్రే కోటీశ్వరులను చేస్తుంది. లక్షల్లో లక్షలు లాభాలు వస్తాయి. మరి ఆ స్టాక్ ఏంటి.? మూవీకి ఆ స్టాక్‌కి ఉన్న లింక్ ఏంటి ఇప్పుడు తెలుసుకుందామా..
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీ, అల్లు అర్జున్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పుష్ప-2’. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్దమైంది. అంతకముందు ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ జోరుగా సాగింది. డిసెంబర్ 30న ప్రారంభమైన ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ద్వారా చిత్ర నిర్మాతలు దాదాపు రూ.25 కోట్లు రాబట్టినట్టు తెలుస్తోంది. అడ్వాన్స్ బుకింగ్ బట్టి తొలిరోజు ఈ సినిమా పాన్ ఇండియా లెవల్‌లో రూ.150 నుంచి రూ. 200 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టవచ్చునని అంచనా.
ఈ రికార్డు స్థాయి అడ్వాన్స్ బుకింగ్‌తో థియేటర్ స్టాక్ PVR ఐనాక్స్ షేర్లు దాదాపు 3 శాతం పెరిగాయి. దీని కారణంగా కొన్ని నిమిషాల్లోనే కంపెనీ మార్కెట్ క్యాప్‌లో రూ.426 కోట్ల పెరుగుదల కనిపించింది. బిజినెస్ నిపుణుల అంచనా ప్రకారం, పుష్ప-2 పాన్ ఇండియా స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. దీని ప్రభావం స్టాక్ మార్కెట్‌పై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. పుష్ప-2తో థియేటర్లకు భారీగా వసూళ్లు వచ్చే అవకాశం ఉండటమే కాదు.. ఆదాయం పెరిగి ఆయా కంపెనీ షేర్లు లాభాల బాట పడతాయని అంటున్నారు.
పీవీఆర్ షేర్లు పైపైకి..
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, ట్రేడింగ్ సెషన్‌లో PVR ఐనాక్స్ షేర్లు దాదాపు 3 శాతం పెరిగాయి. ట్రేడింగ్ సెషన్‌లో కంపెనీ షేర్లు కూడా రోజు గరిష్ఠ స్థాయి రూ.1583.40కి చేరాయి. శుక్రవారం కంపెనీ షేర్లు రూ.1540 వద్ద ముగియగా.. సోమవారం రికార్డు స్థాయిలో రూ. 39.90 మేరకు పెరిగి.. చివరి సెషన్‌లో రూ. 1579.95 వద్ద ముగిశాయి. ఇక డిసెంబర్ 18, 2023న ఈ కంపెనీ షేర్లు 52 వారాల గరిష్ట స్థాయి రూ.1,829కి చేరాయి. ప్రస్తుతం కంపెనీ షేర్లు రికార్డు స్థాయి కంటే దాదాపు 14 శాతం దిగువన ఉన్నాయి. పుష్ప 2 విడుదలతో కంపెనీ షేర్లు సరికొత్త రికార్డు స్థాయికి చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు ఎనలిస్ట్‌లు.
ఏకంగా రూ.426 కోట్లు..
పీవీఆర్ ఐనాక్స్ షేర్ల పెరుగుదల కారణంగా కంపెనీ మార్కెట్ క్యాప్ కూడా పెరిగింది. డేటా ప్రకారం, శుక్రవారం PVR ఐనాక్స్ మార్కెట్ క్యాప్ రూ.15,122.79 కోట్లుగా ఉంది. సోమవారం ట్రేడింగ్‌లో ఇది రూ.15,548.97 కోట్లకు చేరుకుంది. అంటే ఒక్క రోజులోనే పీవీఆర్ ఐనాక్స్ మార్కెట్ క్యాప్ రూ.426.18 కోట్లు పెరిగింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాబోయే రోజుల్లో కంపెనీ షేర్లు మరింత పెరిగే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి