Joe Root vs Virat Kohli: ఆస్ట్రేలియా మాజీ హెడ్ కోచ్ పై మండిపడ్డ మైఖేల్ వాన్! వాట్ నాన్సెన్స్ అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసిన మాజీ కెప్టెన్..
మైఖేల్ వాన్, డారెన్ లెమాన్ మధ్య మాటల యుద్దం నడుస్తోంది. జో రూట్‌ను విరాట్ కోహ్లీ కంటే దిగువ స్థాయిలో ఉన్నాడని పేర్కొన్నాడు లెమన్. రూట్ టెస్ట్ మ్యాచ్‌లో 35 సెంచరీలు సాధించినా, ఆస్ట్రేలియాలో శతకం సాధించలేదని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై వాన్ ఘాటుగా స్పిందించాడు. రూట్ ఫిట్‌గా ఉంటే, కొన్ని సంవత్సరాలలో సచిన్ టెండూల్కర్‌ను మించి పోవచ్చని వాన్ అభిప్రాయపడ్డాడు.
ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్, ఆస్ట్రేలియా మాజీ హెడ్ కోచ్ డారెన్ లెమాన్ జో రూట్‌ను విరాట్ కోహ్లీ కంటే దిగువ స్థాయిగా పేర్కొన్న వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించాడు. లెమాన్ రూట్‌ని “గొప్ప ఆటగాడు” అని పిలిచినప్పటికీ, అతను 35 టెస్ట్ సెంచరీలు సాధించినప్పటికీ ఇంకా క్రికెటర్లలో పై స్థాయికి చేరుకోలేదని అన్నారు. అయితే రూట్ ఇప్పటి వరకు ఆస్ట్రేలియాలో ఒక సెంచరీ కూడా చేయలేదని చెప్పారు.
“జో రూట్ గొప్ప ఆటగాడు, కానీ అతను ఆల్-టైమ్ గ్రేట్ అవుతాడా? అతను యాషెస్‌లో తక్కువ స్కోర్లు చేసాడు, కానీ సెంచరీలు సాధించలేదు . అందువల్ల అతను ఒక మెట్టు క్రింద ఉన్నాడు. అతను ప్రపంచంలోని వివిధ ప్రతికూల పరిస్థితుల్లో పరుగులు సాధించాడు, కానీ అతను ఇంకా ఆ స్థాయిలోకి రాలేదు” అని లెమాన్ పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలపై మైఖేల్ వాన్ మండిపడ్డాడు.. “ఏం నాన్సెన్స్ మాట్లాడుతున్నారని? ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతను ఫిట్‌గా ఉండి, వెన్నుముక బలంగా ఉంటే, కొన్ని సంవత్సరాలలో సచిన్ టెండూల్కర్‌ను కూడా అధిగమించవచ్చు” అని స్పందించారు.
ఆస్ట్రేలియాలో శతకం సాధించలేదు కాబట్టి, దాన్ని కించపరచడం న్యాయమైనది కాదని, అతను అక్కడి మైదానంలో పరుగులు చేయడానికి వచ్చి, ఇకపై మరింత మంచి ప్రదర్శన ఇవ్వడమే కాకుండా, ఇంగ్లండ్ జట్టులో నాలుగో స్థానంలో ఉన్నాడని వాఘన్ పేర్కొన్నాడు.
వచ్చే ఏడాది జో రూట్ రెండు సెంచరీలు సాధించగలడని, ఇంగ్లండ్ ఆడుతున్న విధానం చాలా గొప్ప పోటీగా ఉంటుందని వాఘన్ తెలిపారు.