Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Syed Mushtaq Ali Trophy: 7 సిక్సర్లు, 2 ఫోర్లు, 197.22 స్ట్రైక్ రేట్ తో ఆ ప్లేయర్ ఊచకోత! CSK ఫాన్స్ కి పండగే..

శివమ్ దూబే తన గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చిన తరువాత సర్వీసెస్‌తో జరిగిన మ్యాచ్‌లో 36 బంతుల్లో 71 పరుగులతో చెలరేగిపోయాడు. సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి నాల్గవ వికెట్ భాగస్వామ్యంగా 130 పరుగులు జోడించి ముంబైకి మంచి స్కోరు అందించాడు. దూబేను 2025 IPL సీజన్ కోసం CSK 12 కోట్లు వెచ్చించి రిటైన్ చేసుకుంది.

Syed Mushtaq Ali Trophy: 7 సిక్సర్లు, 2 ఫోర్లు, 197.22 స్ట్రైక్ రేట్ తో ఆ ప్లేయర్ ఊచకోత! CSK ఫాన్స్ కి పండగే..
Shivam Dube
Follow us
Narsimha

|

Updated on: Dec 04, 2024 | 11:14 AM

సర్వీసెస్‌తో జరిగిన మ్యాచ్‌లో శివమ్ దూబే 36 బంతుల్లో 71 పరుగులు సాధించి సత్తా చాటాడు. మూడు నెలల గాయం నుండి తిరిగి వచ్చి తన పవర్ ఎంటో చూపించాడు. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ 46 బంతుల్లో 70 పరుగులతో కెప్టెన్‌గా మంచి ప్రదర్శన చేశాడు. ముంబై బ్యాట్స్‌మెన్‌ భారీ హిట్టింగ్ తో 4 వికెట్ల నష్టానికి 192 స్కోరు చేసారు. సూర్యకుమార్, దూబే కలిసి 130 పరుగుల నాల్గవ వికెట్ భాగస్వామ్యాన్ని స్థాపించి ముంబైకి మంచి స్కోరు అందించారు. దూబే 7 సిక్సర్లు, 2 ఫోర్లు తో లాంగ్ ఆన్, డీప్ మిడ్ వికెట్, స్క్వేర్ లైడ్ లలో షాట్స్ ఆడుతూ అభిమానులను ఉర్రూతలూగించారు.

చేజింగ్ లో సర్వీసెస్ 19.3 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌటయ్యింది. శార్దూల్ ఠాకూర్ తన నాలుగు ఓవర్లలో 4/25 తో అత్యుత్తమ ప్రదర్శన కనబరచి, తన ప్రతిభను నిరూపించుకున్నాడు. షామ్స్ ములానీ కూడా మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో ముంబై 39 పరుగుల తేడాతో గెలిచింది.

అయితే గాయం నుంచి కోలుకున్న దూబే తన సంచలన బ్యాటింగ్ ప్రదర్శనతో CSK అభిమానులకు ఆనందాన్ని కలిగించాడు. రానున్న 2025 IPL సీజనుకు గాను CSK దూబేను రూ. 12 కోట్లకు రిటైన్ చేసుకుంది.