Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దొంగోడే.. కానీ పోలీసులకే షాకయ్యే కథ చెప్పాడు..

దొంగోడే.. కానీ పోలీసులకే షాకయ్యే కథ చెప్పాడు..

Phani CH

|

Updated on: Dec 03, 2024 | 8:09 PM

ప్రతిరోజూ ఏదోక చోట, అనేక దొంగతనాలు వెలుగులోకి వస్తున్నాయి. తమకు మరో మార్గం లేక చోరీలకు పాల్పడుతున్నట్లు కొందరి దొంగల మాటల్లో విన్నాం. తాజాగా ఓ 20 ఏళ్ల విద్యార్థి మొబైల్ షాపు తాళం పగులగొట్టి, చోరీకి పాల్పడ్డ ఘటన మహారాష్ట్రలోని నవీ ముంబైలో జరిగింది. లోపలికి ప్రవేశించి ఒకటి రెండు కాదు ఏకంగా 41 మొబైల్ ఫోన్లను అపహరించాడు.

దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ చోరీ చేసింది ఇంజినీరింగ్ విద్యార్థి అని తేలడంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాను ఇంజినీరింగ్ ఫీజు కట్టేందుకు దొంగతనం చేశానని పోలీసులకు చెప్పాడు. అయితే క్రైం బ్రాంచ్ పోలీసులు లోతుగా విచారించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. మెరుగైన జీవితం గడపాలని, కాలేజీలో డబ్బులు ఎక్కువగా ఖర్చుపెట్టాలన్న కోరికతో చోరీకి పాల్పడినట్లు తేలింది. చోరీకి పాల్పడ్డ వ్యక్తిని ఆకాష్ రాజారామ్ రాజ్‌కుండేగా గుర్తించారు. ఆకాష్.. నెతుల్‌లోని ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. ఓ మొబైల్ షాపులో రూ.24 లక్షల విలువైన 41 మొబైల్ ఫోన్లను దొంగిలించాడు. దుకాణంలో అమర్చిన సీసీ కెమెరాల సాయంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆకాష్‌కు క్రైమ్ హిస్టరీ లేదని, అంటే ఇంతకు ముందు ఏ కేసులోనూ ప్రమేయం లేదని తేలింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చెత్త సంచిలో రూ.5900 కోట్లు పడేసిన మహిళ.. చివరికి ??

ట్రంప్‌ ప్రైవేట్ జెట్‌.. లోపల ఎలా ఉంటుందో తెలుసా ??

రూ.40 వేల కోట్ల ఆస్తిని వదిలి బౌద్ధ సన్యాసిగా..

ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కి వైర్లు పట్టుకుని ఊగిన మహిళ

దోమల బాధ ఉందా ?? ఈ మొక్కలు పెంచి చూడండి