Google map horror: గూగుల్ మ్యాప్‌ను గుడ్డిగా ఫాలో అయిన డ్రైవర్.. కాలవలో పడిన కారు.. తప్పిన ప్రాణాపాయం

కొత్త ప్రదేశానికి వెళుతున్నప్పుడు గూగుల్ మ్యాప్స్ ను ఫాలో అవుతూ వెళ్లి ప్రమాదానికి గురవుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా యూపీలోని బరేలీ-పిలిభిత్ రాష్ట్ర రహదారిపై గూగుల్ మ్యాప్స్‌తో చూపించిన విధంగా వెళ్ళిన వాహనం కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

Google map horror: గూగుల్ మ్యాప్‌ను గుడ్డిగా ఫాలో అయిన డ్రైవర్.. కాలవలో పడిన కారు.. తప్పిన ప్రాణాపాయం
Google Map Horror
Follow us
Surya Kala

|

Updated on: Dec 04, 2024 | 11:53 AM

దారి తెలియకపోతే ఏమిటి.. గూగుల్ మ్యాప్ ఉండగా చింత ఎందుకు దండగ అని అనుకుంటున్నారా.. గూగుల్ మ్యాప్ పై భరోసాతో వాహనంలో ప్రయనిస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త. గుడ్డిగా గూగుల్ ని నమ్మి గూగుల్ మ్యాప్స్‌ మార్గనిర్దేశం చేసిన విధంగా వెళ్తే ప్రమాదాల బారిన పడవచ్చు. ఒకొక్కసారి ప్రాణాలు కూడా పోట్టుకోవచ్చు అని తాజాగా జరిగిన సంఘటనలు తెలియజేస్తున్నాయి. తాజాగా యూపీలోని బరేలీ-పిలిభిత్ రాష్ట్ర రహదారిపై గూగుల్ మ్యాప్స్‌తో చూపించిన విధంగా వెళ్ళిన వాహనం కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. దీంతో గూగుల్ మ్యాప్ పని తీరు.. దారి చూపించే విషయంలో ఏర్పడుతున్న సమస్యలను మరోసారి తెరపైకి తెచ్చింది.

వాస్తవానికి కొత్త ప్రదేశాలకు వెళ్లేవారికి గూగుల్ మ్యాప్స్ యాప్ ఉపయోగకరంగానే ఉంటుంది. అయితే ఒకొక్కసారి ఈ మ్యాప్ చూపించే విషయంలో పొరపాటు వలన ప్రాణాలు పోగొట్టుకోవడం, లేదా తీవ్ర ఇబ్బందులకు గురి అవ్వడం వంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ లో గూగుల్ మ్యాప్స్ ను ఫాలో అవుతూ వెళ్ళిన ఓ వ్యక్తి నిర్ణయం ప్రమాదం బారిన పడేసింది. రాయ్ బరేలీ-పిలిభిత్ రహదారి పై గూగుల్ మ్యాప్స్ ను ఫాలో అవుతూ వెళ్ళిన ఓ కాలువలో పడిపోయింది. కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. బరేలీలోని ఇజ్జత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాలాపురా కెనాల్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.

కాన్పూర్ జిల్లాకు చెందిన దివ్యాన్షు సింగ్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి పిలిభిత్ జిల్లాలో జరిగిన ఓ వివాహ వేడుకకు వెళ్లాడు. ఆ దారి తనకు కొత్త కావడంతో నావిగేషన్ కోసం గూగుల్ మ్యాప్స్‌ని ఉపయోగించాడు. గూగుల్ మ్యాప్ చూపించిన రూట్ ని పక్కగా ఫాలో అవుతూ వెళ్ళిన దివ్యాన్షు కారు బర్కాపూర్ గ్రామం సమీపంలో కాలాపూర్ కెనాల్ లో పడిపోయింది. సుమారు 15 అడుగుల మేరకు కాలువలోకి దూసుకెళ్లింది. రోడ్డు కోతకు గురైన విషయం గమనించకుండా.. మ్యాప్ చూపించిన విధంగా కారు నడపడం వలన ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ ఈ సంఘటన సమయంలో కాలువ ఎండిపోయింది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసు అధికారుల కథనం ప్రకారం కారు గాలిలో చక్రాలతో తలక్రిందులుగా ల్యాండ్ అయింది.

ఇవి కూడా చదవండి

కాగా, కారులో ఉన్న ముగ్గురికీ ఎటువంటి హాని జరగలేదు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సంఘటన స్థానికి చేరుకున్న అధికారులు ఓ క్రేన్ ను తెప్పించి..కాలువలో పడిపోయిన కారును బయటికి తీశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..