Mahesh Babu: చిక్కుల్లో సూపర్ స్టార్.. మహేష్ బాబుకు కన్స్యూమర్ ఫోరం నోటీసులు
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సినిమాలో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబు డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. పాన్ వరల్డ్ మూవీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. కాగా ఇటీవల మహేష్ బాబుకు ED అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. సురానా గ్రూప్, సాయిసూర్య డెవలపర్స్ వ్యవహారంలో.. విచారణకు రావాలంటూ మహేష్‌కు నోటీసులు పంపారు. కానీ ఈ విచారణకు మహేష్ బాబు హాజరు కాలేదు. అయితే ప్రమోషన్ కోసం మహేష్ బాబు సాయిసూర్య డెవలపర్స్ నుంచి రూ. 3.4 కోట్లు తీసుకున్నట్టు గుర్తించిన ఈడీ. సురానా గ్రూప్, సాయిసూర్య డెవలపర్స్ ఆఫీసులతోపాటు, ఈ సంస్థల అధినేతల ఇళ్లపై ED దాడులు చేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా మహేష్ బాబుకు రంగారెడ్డి జిల్లా కన్స్యూమర్ ఫోరం నోటీసులు జారీ చేసింది.
మహేష్ బాబు ఫొటోతో ప్రమోషన్స్ చేయడం వల్ల ఓ మహిళా డాక్టర్ ఓ లేఅవుట్‌లో ప్లాట్లు కొనుగోలు చేశాను అని రంగారెడ్డి జిల్లా కన్స్యూమర్ ఫోరంలో ఫిర్యాదు చేసింది. ఒకొక్క ప్లాట్‌కు రూ.34.80 లక్షలు తీసుకున్నారని తీరా డబ్బు చెల్లించిన తర్వాత ప్లాట్‌కు అనుమతి లేదని తెలిసిందని ఆమె ఆరోపించారు. కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వాలని సాయిసూర్య డెవలపర్స్ సంస్థ ఎండీ సతీష్ చంద్రగుప్తాను ప్రశ్నిస్తే ఆయన కేవలం రూ. 15 లక్షలు మాత్రమే ఇచ్చారని ఆమె ఆరోపించారు. ఆమె పిటీషన్ ను విచారించిన వినియోగదారుల ఫోరం.. సాయిసూర్య డెవలపర్స్ సంస్థ ఎండీ సతీష్ చంద్రగుప్తాతోపాటు ప్రమోట్ చేసిన మహేష్ బాబుకు కూడా నోటీసులు పంపారు. జూలై 8 సోమవారం లోపు న్యాయవాదులతో సహా రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరం ఎదుట హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. మరి మహేష్ బాబు ఈ విచారణకు హాజరవుతారా.? లేక ఆయన లాయర్లను పంపుతారా అన్నది చూడాలి.
మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని తెలుస్తుంది. రాజమౌళి సినిమా అప్డేట్స్ కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్న అభిమానులకు ఇప్పుడు ఈ వార్త షాక్ ఇచ్చింది. కన్స్యూమర్ ఫోరం మహేష్ బాబుకు నోటీసులు ఇవ్వడంతో ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నోటీసుల పై మహేష్ బాబు ఎలా స్పందిస్తారో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




