Stalin Movie: స్టాలిన్ మూవీ రీరిలీజ్.. వీడియో షేర్ చేసిన చిరంజీవి.. విడుదల ఎప్పుడంటే..
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. 69 ఏళ్ల వయసులోనూ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. అలాగే డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇవే కాకుండా మరిన్ని సినిమాలు చేసేందుకు చిరు రెడీగా ఉన్నారు.
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. ఇప్పటికే పలు హీరోల సినిమాలు మరోసారి అడియన్స్ ముందుకు వచ్చాయి. ఒకప్పుడు థియేటర్లలో డిజాస్టర్ అయిన సినిమాలు.. ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అయితే అప్పటికంటే ఇప్పుడే అత్యధిక వసూళ్లు రాబడుతున్నాయి. ఇటీవల కొన్ని సినిమాలు రీరిలీజ్ లో సత్తా చాటుతున్నాయి. వాటికి ఏమాత్రం క్రేజ్ తగ్గట్లేదు. ఆ సినిమాలు చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. ఇప్పుడు మరో సూపర్ హిట్ సినిమా రీరిలీజ్ కు రెడీ అయ్యింది. అదే మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన స్టాలిన్ సినిమా. కోలీవుడ్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2006లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు దాదాపు 19 ఏళ్ల తర్వాత ఈ సినిమా రీరిలీజ్ కాబోతుంది. ఈ సినిమా విడుదల తేదీని స్వయంగా చిరంజీవి అధికారికంగా ప్రకటించారు.
ఇవి కూడా చదవండి: అరాచకం భయ్యా.. వయ్యారాలతో గత్తరలేపుతున్న సీరియల్ బ్యూటీ..
చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 22న ఈ సినిమాను రీరిలీజ్ చేయనున్నట్లు చిరు తెలిపారు. ఇందుకోసం చిత్ర నిర్మాత.. తన తమ్ముడు నాగబాబు సిద్ధమవుతున్నారని అన్నారు. ఇందులో త్రిష కథానాయికగా కనిపించగా.. చిరు సోదరిగా ఖుష్బూ నటించింది. మణిశర్మ అందించిన మ్యూజిక్ , పాటలు ఆకట్టుకున్నాయి.
ఇవి కూడా చదవండి: Actress : ఈ క్రేజ్ ఏంట్రా బాబూ.. 40 ఏళ్లు దాటిన తగ్గని జోరు.. 50 సెకండ్స్ కోసం 5 కోట్లు రెమ్యునరేషన్..




