AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SSMB 29 Globetrotter Event: టైటిల్ అద్దిరిపోయిందంతే.. మహేష్- రాజమౌళి సినిమా పేరు ఇదే.. అధికారిక ప్రకటన

సూపర్ స్టార్ మహేష్‌ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో ఓ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. గ్లోబ్ ట్రాటర్ (వర్కింగ్ టైటిల్) పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించి శనివారం (నవంబర్ 15) హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ గ్రాండ్ ఈవెంట్ జరుగుతోంది.

SSMB 29 Globetrotter Event: టైటిల్ అద్దిరిపోయిందంతే.. మహేష్- రాజమౌళి సినిమా పేరు ఇదే.. అధికారిక ప్రకటన
Mahesh Babu Varanasi Movie
Basha Shek
|

Updated on: Nov 15, 2025 | 7:29 PM

Share

మహేష్ బాబు ఫ్యాన్స్ కు పండగ లాంటి వార్త వచ్చేసింది. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ నటిస్తోన్న సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ గ్రాండ్ ఈవెంట్ జరుగుతోంది. ఇదే ఈవెంట్ లో మహేష్- రాజమౌళి సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు.   ఈవెంట్ ప్రారంభంలోనే మహేష్ బాబు మూవీ టైటిల్  ను అనౌన్స్ చేయడం వివేషం. గత కొన్ని రోజులుగా  ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ పలు పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా  రుద్ర, వారణాసి.. ఇలా పలు టైటిల్స్ వినిపించాయి.  వీటిలో ఏది ఫిక్స్ చేస్తారా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడీ నిరీక్షణకు తెరపడింది. చాలా మంది  అనుకుంటున్నట్లే మహేష్ బాబు సినిమాకు ‘వారణాసి’ అని ఫిక్స్ చేశారు.  ఈ మేరకు గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో టైటిల్ గ్లింప్స్ వీడియోని ఈవెంట్ స్క్రీన్ పై ప్రసారం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. ముఖ్యంగా మహేష్ బాబు లుక్ అయితే అద్దిరిపోయిందని అభిమానులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా వారణాసి సినిమాలో మహేశ్ బాబు రుద్ర అనే పాత్రలో కనిపించబోతున్నాడు. అలాగే గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, మందాకిని పాత్రలో సందాడి చేయనుంది. ఇక మలయాళ సూపర్ స్టార్  పృథ్వీరాజ్ సుకుమారన్, కుంభ అనే పవర్ ఫుల్ విలన్‌గా భయపెట్టనున్నాడు. ఈ సినిమాలో ఇంకా ఎవరెవరు నటించనున్నారన్నది ఈ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లోనే  అనౌన్స్ చేయనున్నారని తెలుస్తోంది.

రుద్రగా  రానున్న మహేష్ బాబు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కోహ్లీ 53వ సెంచరీకి ఫిదా.. అనుష్క శర్మ పోస్ట్ వైరల్
కోహ్లీ 53వ సెంచరీకి ఫిదా.. అనుష్క శర్మ పోస్ట్ వైరల్
12 సినిమాలు.. 2 హిట్స్.. ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
12 సినిమాలు.. 2 హిట్స్.. ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?