Sreeleela: నాలుగేళ్ల క్రితమే ఆ సినిమా చేయాల్సిన శ్రీలీల.. కానీ ఎలా మిస్సయ్యిందంటే..

మాస్ మాహారాజా రవితేజ సరసన ధమాకా చిత్రంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ మూవీ శ్రీలీల క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆమెకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. పవర్ కళ్యాణ్, రామ్ పోతినేని, బాలకృష్ణ, మహేష్ బాబు వంటి స్టార్ హీరోల చిత్రాల్లో నటిస్తోంది. అంతేకాదు.. ప్రస్తుతం ఆమె నటిస్తున్న సినిమాలన్ని సెట్స్ పై శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి.

Sreeleela: నాలుగేళ్ల క్రితమే ఆ సినిమా చేయాల్సిన శ్రీలీల.. కానీ ఎలా మిస్సయ్యిందంటే..
Sreeleela
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 29, 2023 | 3:13 PM

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల. చేతిలో అరడజనుకు పైగా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ హీరోయిన్. పెళ్లి సందడి సినిమాతో కథానాయికగా అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. అందం, అభినయంతోనే కాకుండా.. డ్యాన్స్‏తోనూ అదుర్స్ అనిపించుకుంది. ఇక ఆ తర్వాత మాస్ మాహారాజా రవితేజ సరసన ధమాకా చిత్రంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ మూవీ శ్రీలీల క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆమెకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. పవర్ కళ్యాణ్, రామ్ పోతినేని, బాలకృష్ణ, మహేష్ బాబు వంటి స్టార్ హీరోల చిత్రాల్లో నటిస్తోంది. అంతేకాదు.. ప్రస్తుతం ఆమె నటిస్తున్న సినిమాలన్ని సెట్స్ పై శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. అయితే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఏడాదిలోనే స్టా్ర్ డమ్ సంపదించుకుని ఫుల్ బిజీ అయ్యింది శ్రీలీల. నిజానికి ఆమె నాలుగేళ్ల క్రితమే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాల్సిందట. ఈ విషయాన్ని స్వయంగా యంగ్ హీరో నాగశౌర్య చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం నాగశౌర్య రంగబలి చిత్రంతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను నటించిన సూపర్ హిట్ మూవీ ఛలో చిత్రంలో ముందుగా శ్రీలీలను కథానాయికగా అనుకున్నారట. అప్పటికే ఆమెను సంప్రదించగా.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. కానీ చివరి క్షణంలో నో చెప్పడంతో కన్నడ బ్యూటీ రష్మికను తీసుకున్నారట.

ఇవి కూడా చదవండి

నాగశౌర్య నటించిన ఛలో చిత్రంతోనే రష్మిక మందన్నా హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది. అప్పట్లో ఈ సినిమా పెద్ద విజయం సాధించింది. ఇక ఆ తర్వాత గీతా గోవిందం చిత్రంలో నటించింది. ఇక ఈ మూవీ తర్వాత రష్మిక టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అయ్యింది. అలా అప్పుడే సూపర్ హిట్ సినిమాను మిస్ చేసుకుంది శ్రీలీల. అయినప్పటికీ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.

View this post on Instagram

A post shared by Sreeleela (@sreeleela14)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.