Prabhas: జూన్ 28 ప్రభాస్ కెరీర్‏లోనే అత్యంత స్పెషల్.. ఎందుకో తెలుసా..

ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వస్తోంది. ఓవైపు ఈ చిత్రంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నప్పటికీ మరోవైపు కలెక్షన్స్ కూడా భారీగానే వస్తున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ నటనపై ప్రశంసలు వస్తుండగా.. డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సినీ ప్రముఖులు.

Prabhas: జూన్ 28 ప్రభాస్ కెరీర్‏లోనే అత్యంత స్పెషల్.. ఎందుకో తెలుసా..
Prabhas
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 28, 2023 | 3:49 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. డార్లింగ్ మూవీస్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన బాహుబలి సినిమాతో క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో ఆయనకు వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ అయ్యారు. ఇక ఇటీవలే ఆదిపురుష్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చాడు ప్రభాస్. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వస్తోంది. ఓవైపు ఈ చిత్రంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నప్పటికీ మరోవైపు కలెక్షన్స్ కూడా భారీగానే వస్తున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ నటనపై ప్రశంసలు వస్తుండగా.. డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సినీ ప్రముఖులు. ఇదిలా ఉంటే.. ప్రభాస్ ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ కె చిత్రాల్లో నటిస్తున్నారు. కొద్దిరోజులుగా ఈ మూవీ షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలోనూ ఓ మూవీ చేస్తున్నారు.

అయితే జూన్ 28 ప్రభాస్ కెరీర్ లో అత్యంత స్పెషల్. ఎందుకో తెలుసా.. హీరోగా డార్లింగ్ అరంగేట్రం చేసిన ఈశ్వర్ సినిమా ఈ రోజే ప్రారంభమైంది. దాదాపు 21 సంవత్సరాల క్రితం ప్రభాస్ హీరోగా డైరెక్టర్ జయంత్ పరాన్జీ దర్శకత్వం వహించిన ఈశ్వర్ సినిమా 2002 జూన్28న స్టార్ట్ అయ్యింది. దివంగత నటుడు కృష్ణంరాజు ఈ సినిమాకు క్లాప్ కొట్టారు. ఈ సినిమాలో ప్రభాస్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత వర్షం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు ప్రభాస్.

ఇవి కూడా చదవండి

ఈశ్వర్ చిత్రంలో శ్రీదేవి విజయ్ కుమార్ కథానాయికగా నటించగా.. రేవతి, శివకృష్ణ, బ్రహ్మానందం, గుండు హనుమంతరావు కీలకపాత్రలలో నటించారు. ఈ చిత్రానికి ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించారు. ఈ సినిమాతో హీరోగా ప్రభాస్.. హీరోయిన్ గా శ్రీదేవి విజయ్ కుమార్ సినీరంగంలోకి అడుగుపెట్టారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.