Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karthika Deepam: కార్తీక దీపం 2పై క్లారిటీ ఇచ్చిన డాక్టర్ బాబు.. ఏమన్నారంటే..

ఇక ఇందులోని వంటలక్క, డాక్టర్ బాబు పాత్రలకు ప్రేక్షకులు ఎంతగా కనెక్ట్ అయ్యారో చెప్పక్కర్లేదు. వీరిద్దరిని తమ ఇంట్లో మనుషులుగా ఓన్ చేసేసుకున్నారు. మహిళలు కాదు.. యూత్‏లోనూ ఈ రెండు పాత్రలకు అభిమానులు ఉన్నారు. అంతేకాదు.. కార్తీక దీపం సీరియల్ సాంగ్ నుంచి.. డైలాగ్స్, సన్నివేశాల వరకు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యాయి.

Karthika Deepam: కార్తీక దీపం 2పై క్లారిటీ ఇచ్చిన డాక్టర్ బాబు.. ఏమన్నారంటే..
Karthika Deepam 2
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 27, 2023 | 5:18 PM

బుల్లితెరపై సంచలనం సృష్టించింది కార్తీక దీపం. దాదాపు ఏడేళ్లు నెంబర్ స్థానాన్ని కైవసం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ దక్కించుకుని టాప్ పొజిషన్లో ఉండేది. ఇక ఇందులోని వంటలక్క, డాక్టర్ బాబు పాత్రలకు ప్రేక్షకులు ఎంతగా కనెక్ట్ అయ్యారో చెప్పక్కర్లేదు. వీరిద్దరిని తమ ఇంట్లో మనుషులుగా ఓన్ చేసేసుకున్నారు. మహిళలు కాదు.. యూత్‏లోనూ ఈ రెండు పాత్రలకు అభిమానులు ఉన్నారు. అంతేకాదు.. కార్తీక దీపం సీరియల్ సాంగ్ నుంచి.. డైలాగ్స్, సన్నివేశాల వరకు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యాయి. రోటిన్ సాగదీత కాకుండా.. ఎప్పటిక్పపుడు ట్విస్టులు.. ఫ్యామిలీ ఎమోషన్స్ అన్ని అంశాలను అడియన్స్ ముందుకు తీసుకురావడంతో ఈ సీరియల్ చాలా సంవత్సరాల పాటు అగ్రస్థానంలో నిలబెట్టింది. అయితే ఆ తర్వాత ఈ సీరియల్ స్థానం నెమ్మదిగా తగ్గిపోయింది. వంటలక్క, డాక్టర్ బాబు పాత్రలను తొలగించడంతో టీఆర్పీ రేటింగ్ పడిపోయింది. అయితే ఆ తర్వాత మళ్లీ మార్పులు చేసి ఈ రెండు పాత్రలు తిరిగి తీసుకొచ్చినప్పటికీ రేటింగ్ పెరగలేదు. దీంతో ఈ ధారవాహికను ఆపేశారు.

అయితే ఈ సీరియల్ సిక్వెల్ రాబోతుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. దీంతో డాక్టర్ బాబు, వంటలక్కను మళ్లీ చూడొచ్చు అని సంతోషంతో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అడియన్స్. ఈ క్రమంలోనే తాజాగా ఈ సీరియల్ సీక్వెల్ పై డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ పరిటాల స్పందించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నిరుపమ్ మాట్లాడుతూ.. ఎక్కడికి వెళ్లినా సరే వంటలక్క గురించే నన్ను అడుగుతుంటారని.. నా పేరు దాదాపు అందరూ మర్చిపోయారని అన్నారు.

ఇవి కూడా చదవండి

తనను ఇప్పటికీ డాక్టర్ బాబు అనే పిలుస్తుంటారని.. ప్రతి ఒక్కరి జీవితాల్లో గొడవలు సాధారణమని.. అందుకే కార్తీక దీపం అందరికి కనెక్ట్ అయ్యిందని చెప్పుకొచ్చారు. తన భార్యతో ఎక్కడికి వెళ్లినా వంటలక్క గురించి అడుగుతుంటారని.. అది విని తన భార్య నవ్వి ఊరుకుంటుందని అన్నారు. తనకు తెలిసినంతవరకు కార్తీక దీపం కొనసాగింపు ఉండకపోవచ్చని.. కార్తీక దీపం కంటే మంచి కథ దొరకాలని.. అన్ని కుదిరితే కార్తీక దీపం 2.. లేదంటే దానిని టచ్ చేయకపోవడమే మంచిదన్నారు. ఇక వంటలక్క, డాక్టర్ బాబు కాంబోలో మరో సీరియల్ వచ్చే ఛాన్స్ ఉందన్నారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.