Anurag Kashyap: ‘లేచిపోదామా’.. ఆ డైలాగ్‏కు పడిపోయాను.. బాలీవుడ్ డైరెక్టర్‏కు తెగ నచ్చేసిన ఆ సినిమా .?

సౌత్ ఇండస్ట్రీలో కమల్ హాసన్, రజినీకాంత్ కు నేను మంచి అభిమానిని. వారి సినిమాలు చూడడం వల్లే నాకు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి తెలిసింది. జీత్ హమారీ, ఏక్ దుజే కే లియే వంటి సినిమాలు చూసిన రోజులు నాకింక గుర్తున్నాయి. అలాగే చిరంజీవి, నాగార్జున నటించిన సినిమాలు కూడా హిందీలోకి డబ్ అయ్యేవి.

Anurag Kashyap: 'లేచిపోదామా'.. ఆ డైలాగ్‏కు పడిపోయాను.. బాలీవుడ్ డైరెక్టర్‏కు తెగ నచ్చేసిన ఆ సినిమా .?
Anurag Kashyap
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 27, 2023 | 3:47 PM

గత కొన్నాళ్లుగా బాక్సాఫీస్ వద్ద సౌత్ మూవీస్ సత్తా చాటుతున్నాయి. చిన్న సినిమాలుగా విడుదలై నార్త్ ఆడియన్స్‏ను మెప్పిస్తున్నాయి. పాన్ ఇండియా లెవల్లో విడుదలై భారీగా వసూళ్లు రాబడుతున్నాయి. ఈ క్రమంలో అటు సౌత్ వర్సెస్ బాలీవుడ్ చర్చలు కూడా జరుగుతున్నాయి. ఓవైపు దక్షిణాది చిత్రాలు భారీ విజయాన్ని అందుకుంటుండగా.. మరోవైపు.. హిందీ చిత్రాలు మాత్రం డిజాస్టర్స్ అవుతున్నాయి. దీంతో బీటౌన్ స్టార్స్ సౌత్ మూవీస్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు హిందీ డైరెక్టర్ సౌత్ మూవీపై ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ డైరెక్ట్ర అనురాగ్ కశ్యప్ దక్షిణాది చిత్రాలలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

“సౌత్ ఇండస్ట్రీలో కమల్ హాసన్, రజినీకాంత్ కు నేను మంచి అభిమానిని. వారి సినిమాలు చూడడం వల్లే నాకు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి తెలిసింది. జీత్ హమారీ, ఏక్ దుజే కే లియే వంటి సినిమాలు చూసిన రోజులు నాకింక గుర్తున్నాయి. అలాగే చిరంజీవి, నాగార్జున నటించిన సినిమాలు కూడా హిందీలోకి డబ్ అయ్యేవి. లేచిపోదామా… అన్న డైలాగ్ విని నాగార్జున నటించిన గీతాంజలి సినిమా చూశాను. నేను తెరకెక్కించిన బాంబే వెల్వెట్ ఘోర పరాజయాన్ని అందుకుంది. దీంతో నిర్మాణ సంస్తకు నేను తిరిగి డబ్బులు చెల్లించాల్సి వచ్చింది.

ఇవి కూడా చదవండి

అందుకోసం నేను వాళ్లి నిర్మించిన అకీరా చిత్రంలో కీలకపాత్రలో నటించాను. ఆ తర్వాత నటుడిగా ఎన్నో ఆఫర్స్ వచ్చాయి. కానీ నో చెప్పాను. ప్రస్తుతం విజయ్ సేతుపతితో ఓ ప్రాజెక్టులో నటిస్తున్నాను. ఇటీవల తమిళంలో విక్రమ్ నటిస్తోన్న తంగలాన్ టీజర్ చూశాను. అలాంటి విజువల్స్ హిందీలో కనిపించవు. కేవలం సౌత్ సినిమాల్లో వాళ్ల మూలలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి సినిమాలు చేస్తారు. కానీ హిందీలో ఎక్కువగా మా మూలాలు చూపించరు. షూటింగ్స్ కోసం బయటి దేశాలకు వెళ్లిపోతుంటారు. మా సినిమాల్లో సహజత్వం తగ్గిపోయింది. కానీ నేటివిటీ, సహజత్వం దక్షిణాది సినిమాల్లోనే కనిపిస్తుంది” అంటూ చెప్పుకొచ్చారు.