AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sekhar Master: ‘ఏదో థంబ్ నెయిల్స్ పెట్టి.. ఏదోదో చేస్తున్నారు.. నిజాలు రాయండి’.. శేఖర్ మాస్టర్ ఎమోషనల్..

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ఇటీవల అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. జూన్ 28న ఆయన పెద్ద కర్మను హైదరాబాద్‏లో రాకేష్ మాస్టర్ శిష్యూలు శేఖర్ మాస్టర్, సత్య మాస్టర్స్ జరిపించారు. ఈ సందర్భంగా తమపై వచ్చిన విమర్శలపై స్పందిస్తూ శేఖర్ మాస్టర్ ఎమోషనల్ అయ్యారు.

Sekhar Master: 'ఏదో థంబ్ నెయిల్స్ పెట్టి.. ఏదోదో చేస్తున్నారు.. నిజాలు రాయండి'.. శేఖర్ మాస్టర్ ఎమోషనల్..
Sekhar Master
Rajitha Chanti
|

Updated on: Jun 28, 2023 | 6:35 PM

Share

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ఇటీవల అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. జూన్ 28న ఆయన పెద్ద కర్మను హైదరాబాద్‏లో రాకేష్ మాస్టర్ శిష్యూలు శేఖర్ మాస్టర్, సత్య మాస్టర్స్ జరిపించారు. ఈ సందర్భంగా తమపై వచ్చిన విమర్శలపై స్పందిస్తూ శేఖర్ మాస్టర్ ఎమోషనల్ అయ్యారు. రాకేష్ మాస్టర్‏తో తనకున్న అనుబంధాన్ని తెలియజేస్తూనే తన గురించి వస్తున్న వార్తలపై రియాక్ట్ అయ్యారు. “రాకేష్ మాస్టర్.. మాదీ ఎనిమిది సంవత్సరాల జర్నీ. అప్పుడు మాకు బయటప్రపంచం అంటే ఏంటో తెలియదు. విజయవాడలో డ్యాన్స్ నేర్చుకుని ఆ తర్వాత రాకేష్ మాస్టర్ దగ్గరకు నేను, సత్య వచ్చాము.

చాలా మంది ఇప్పుడు రాకేష్ మాస్టర్ డ్యాన్సులు యూట్యూబ్ లో చూస్తున్నారు. కానీ చాలా మందికి తెలియని విషయమేంటంటే రాకేష్ మాస్టర్ డాన్స్ 5 పర్సంటే. మంచి స్టైల్ మాస్టర్ ది. నాకు పర్సనల్ గా ప్రభుదేవా అంటే ఇష్టం. కానీ హైదరాబాద్ వచ్చాక.. రాకేష్ మాస్టర్ డాన్స్ చూసి చాలా ఇష్టపడ్డాను. గతంలో మేము ఉన్నప్పుడు ఆయన బాగా చేసేవారు. ఆయన మా గురువు అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. డాన్స్ నేర్పించేటప్పుడు పర్ఫెక్ట్ గా చేసేవరకు ఊరుకునేవారు కాదు.

ఇవి కూడా చదవండి

ఆయన ఎక్కడున్నా బాగుండాలని కోరుకున్నాం.. కానీ ఇలా అవుతుందని ఊహించలేదు. రాకేష్ మాస్టర్ మ్యారెజ్ చేసింది కూడా నేనే. ఆయనతో ఉండి ఇన్ స్టిట్యూట్ లోనే క్లాసులు చెప్పుకుంటూ అక్కడే ఉండేవాళ్లం. తర్వాత మాస్టర్ దర్శకుడిగా ప్రయత్నాలు స్టార్ట్ చేస్తున్న సమయంలో మాకేమీ చేయాలో తెలియక బయటకు వచ్చి మాస్టర్స్ అయ్యాం. ఇప్పుడు కొంతమంది యూట్యూబ్ ఛానల్స్.. ఏదో థంబ్ నెయిల్స్ పెట్టి.. ఏదేదో చేస్తున్నారు. దానివల్ల చాలా కుటుంబాలు బాధపడుతున్నాయి. వాస్తవాలు తెలుసుకుని రాయండి.. మాస్టర్ ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నాము” అంటూ భావోద్వేగానికి లోనయ్యారు శేఖర్ మాస్టర్.