Shivamani: నాగార్జున బ్లాక్ బస్టర్ హిట్ శివమణి సినిమాను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా..

వైష్నో అకాడమీ బ్యానర్ పై పూరీ నిర్మించిన ఈ సినిమా 2003లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాకు దివంగత మ్యూజిక్ డైరెక్టర్ చక్రి అందించిన సంగీతం ఇప్పటికీ శ్రోతలను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో నాగ్ నటన, మెకోవర్, స్టైల్ అప్పట్లో యువతను తెగ ఆకర్షించింది

Shivamani: నాగార్జున బ్లాక్ బస్టర్ హిట్ శివమణి సినిమాను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా..
Shivamani
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 28, 2023 | 5:34 PM

అక్కినేని నాగార్జున కెరీర్‏లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ చిత్రం శివమణి. మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ప్రేమకథా చిత్రంలో అక్కినేని నాగార్జున, ఆసిన్, రక్షిత ప్రధాన పాత్రలలో నటించారు. వైష్నో అకాడమీ బ్యానర్ పై పూరీ నిర్మించిన ఈ సినిమా 2003లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాకు దివంగత మ్యూజిక్ డైరెక్టర్ చక్రి అందించిన సంగీతం ఇప్పటికీ శ్రోతలను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో నాగ్ నటన, మెకోవర్, స్టైల్ అప్పట్లో యువతను తెగ ఆకర్షించింది. అయితే ఈ సినిమాను నిజానికి నాగ్ చేయాల్సింది కాదట. ఈ మూవీ స్టోరీని ముందుగా విక్టరీ వెంకటేష్ కోసం రాసుకున్నారట పూరీ. అయితే వెంకీకి ఫస్ట్ హాప్ బాగా నచ్చింది కానీ.. సెకండ్ హాఫ్ ఎందుకో ఆయనకు ఎక్కువగా నచ్చలేదట.

ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక సినిమాలాగా.. సెకండ్ హాఫ్ మొత్తం మరో సినిమాలాగా అనిపిస్తుందని చెప్పాడట. అయితే కథలో మార్పులు చేసేందుకు స్కోప్ లేకపోవడంతో వెంకీ ఈ సినిమాకు నో చెప్పారట. ఆ తర్వాత కొన్నాళ్లకు ఇదే కథను నాగార్జునకు చెప్పగా.. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. అలా నాగ్, పూరీ కాంబోలో శివమణి సినిమా తెరకెక్కింది. భారీ అంచనాల మధ్య అడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా.. కమర్షియల్ గా హిట్ అయ్యింది.

ఇదిలా ఉంటే.. అప్పట్లోనే ఈ సినిమా దాదాపు 14 కోట్ల షేర్ వసూళ్లు రాబట్టింది. అయితే వెంకీ చెప్పినట్లుగానే ఫస్ట్ హాఫ్ సైతం జనాలకు తెగ నచ్చిందట.. ఆ తర్వాత సెకండ్ హాఫ్ పై మిక్స్డ్ టాక్ వచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.