Tollywood: ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టరా ?.. ఒక్క సినిమాతోనే తెగ ఫేమస్ అయిపోయింది..

ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్‏గా క్రేజ్ సంపాదించుకుని.. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమవుతుంటారు. అలాంటి వారి జాబితాలో ఈ హీరోయిన్ ఒకరు. పైన ఫోటోలో కనిపిస్తున్న కథానాయిక ఎవరో గుర్తుపట్టరా ?. ఒక్క సినిమాతోనే ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

Tollywood: ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టరా ?.. ఒక్క సినిమాతోనే తెగ ఫేమస్ అయిపోయింది..
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 28, 2023 | 7:10 PM

వెండితెరపై తొలి సినిమాతోనే మాయ చేసిన తారలు చాలా మంది ఉంటారు. అందులో కొందరు ఒకటి రెండు సినిమాలు చేసి తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటారు. ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్‏గా క్రేజ్ సంపాదించుకుని.. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమవుతుంటారు. అలాంటి వారి జాబితాలో ఈ హీరోయిన్ ఒకరు. పైన ఫోటోలో కనిపిస్తున్న కథానాయిక ఎవరో గుర్తుపట్టరా ?. ఒక్క సినిమాతోనే ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా.. తెలుగు అడియన్స్ మదిలో చెరగని ఆమె రూపం. ఎవరో గుర్తుపట్టండి. తనే అన్షు. ఈ పేరు చెబితే గుర్తుపట్టడం కష్టమే. కానీ మన్మథుడు సినిమా హీరోయిన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. అంతగా తెలుగు ప్రేక్షకులకు తన పాత్రతో చేరువయ్యింది. ఈచిత్రంలో అందం, అభినయంతో కట్టిపడేసింది.

అక్కినేని నాగార్జున నటించిన మన్మథుడు చిత్రంతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది అన్షు. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2002లో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె.. ఆ తర్వాత ప్రభాస్ నటించిన రాఘవేంద్ర చిత్రంలో నటించింది. అమాయకత్వం.. ఆకట్టుకునే రూపంతో ప్రేక్షకులను మెప్పించింది. అయితే అప్పట్లో కుర్రాళ్ల ఫేవరేట్ హీరోయిన్ అయిన అన్షుకు తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. ఒకటి రెండు సినిమాలతో సరిపెట్టుకుంది. ఇక ఆ తర్వాత తమిళంలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ అక్కడ కూడా ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. అన్షు కోలీవుడ్ లో నటించిన చివరి సినిమా జై.

ఇవి కూడా చదవండి

అయితే ఇండస్ట్రీలో అవకాశాలు లేకపోవడంతో.. కథానాయిక కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టేసి లండన్ కు చెందిన సచిన్ సగ్గర్ ను 2003లో పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయ్యింది. వీరికి పాప, బాబు ఉన్నారు. అన్షు హీరోయిన్ కావడానికి ముందు ఫ్యాషన్ డిజైనర్. దీంతో ప్రస్తుతం ఆమె ఫ్యాషన్ డిజైనర్ గా గార్మంట్స్ బిజినెస్ చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో అన్షు చాలా యాక్టివ్. ఫోటోస్ షేర్ చేయడమే కాదు.. రీల్స్ కూడా చేస్తుంది. తాజాగా ఆమె తన ఫ్యామిలీతో కలిసి షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..