AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonu Sood: ఆ చిన్నారి జీవితంలో వెలుగులు నింపిన సోనూసూద్.. దేవుడంటూ నెటిజన్స్ పొగడ్తలు..

వెండితెరపై భయంకరమైన విలన్. కానీ నిజ జీవితంలో మాత్రం సూపర్ హీరో. కష్టాల్లో ఉన్న ప్రజలకు అన్ని తానై అండగా నిలబడతాడు. వేలాది మంది హృదయాల్లో దేవుడిగా కొలువై ఉన్నాడు. కొవిడ్ సమయం నుంచి ఎంతో మందికి సేవ చేస్తూ.. ఆర్థిక కష్టాలతో సతమవుతున్న వారికి నేనున్నానంటూ చేయూత అందిస్తాడు. తాజాగా ఓ చిన్నారి జీవితంలో వెలుగులు నింపాడు.

Sonu Sood: ఆ చిన్నారి జీవితంలో వెలుగులు నింపిన సోనూసూద్.. దేవుడంటూ నెటిజన్స్ పొగడ్తలు..
Sonu Sood
Rajitha Chanti
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Nov 13, 2024 | 2:45 PM

Share

సోనూసూద్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భారతీయ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు ఈ స్టైలీష్ విలన్. అరుంధతి, జులాయి వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే వెండితెరపై విలన్ అయినా.. నిజ జీవితంలో మాత్రం హీరో. కష్టాల్లో ఉన్నవారికి నేనున్నానంటూ చేయూత అందిస్తాడు. కొవిడ్ సమయంలో ఎంతోమందికి సాయం చేసి తన మంచి మనసు చాటుకున్నాడు. పవర్ ఫుల్ విలన్ పాత్రలతో భయపెట్టినా రియల్ లైఫ్ లో దేవుడు అంటూ ఎంతో మంది ఆరాధిస్తున్నారు. ఇప్పటికీ ఏ అవసరం ఉన్న లేదనకుండా సాయం చేస్తుంటారు. ఫౌండేషన్స్ కూడా రన్ చేస్తున్నాడు. పేద విద్యార్థులకు అండగా ఉంటున్నాడు. తాజాగా మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు సోనూసూద్.

మూడేళ్ల చిన్నారికి హార్ట్ ఆపరేషన్ చేయించి పెద్ద మనసు చాటుకున్నాడు సోనూసూద్. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా చెన్నూరుకు చెందిన కృష్ణ, బిందు ప్రియలది నిరుపేద కుటుంబం. వీరి మూడేళ్ల కూతురు చిన్నప్పటి నుంచే గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుంది. చిన్నారికి హార్ట్ సర్జరీ చేయించాలంటే రూ.6 లక్షలకు పైగా ఖర్చవుతుందని డాక్టర్స్ తెలిపారు. వైద్యం చేయించడానికి ఆర్థికంగా బలంగా లేని కృష్ణ, బిందుప్రియలు సాయం చేసేవారి కోసం ఎదురుచూస్తున్నారు. వీరి విషయాన్ని ఓ స్వచ్ఛంద సంస్థ సోనూసూద్ దృష్టికి తీసుకెళ్లింది. వారి కుటుంబ పరిస్థితి తెలుసుకున్న సోనూసూద్ వెంటనే సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు.

ఆ చిన్నారికి ముంబైలో ఉచితంగా హార్ట్ ఆపరేషన్ చేయించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. కష్టాల్లో ఉన్న చిన్నారి ప్రాణాలు కాపాడి మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న సోనూసూద్ పై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆయన దేవుడంటూ కామెంట్స్ చేస్తున్నారు. గతంలోనూ సోనూసూద్ కర్నూలు జిల్లాకు చెందిన కమారి అనే యువతికి చదువుకోవడానికి సహాయం  చేశారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి : Arundhati movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు.. అరుంధతి డ్యాన్స్ టీచర్‏ను చూశారా..?

Tollywood: ఆ ఒక్క డైలాగ్‏తో నెట్టింట తెగ ఫేమస్.. ఈ యంగ్ హీరో సతీమణి ఎవరో గుర్తుపట్టారా.?

Pawan Kalyan: ఏంటీ బాస్.. మరీ అంత తక్కువా.. పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీ రెమ్యునరేషన్ తెలిస్తే..

Samantha: సామ్ ఈజ్ బ్యాక్.. సిటాడెల్ కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌