AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raashi Khanna: బ్రేకప్ వల్ల మానసికంగా కుంగిపోయాను.. వాళ్లే నా బలం.. హీరోయిన్ రాశీ ఖన్నా..

దక్షిణాడి సినీప్రియులకు ఇష్టమైన హీరోయిన్లలో రాశీ ఖన్నా ఒకరు. తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోల సరసన నటించినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు స్టార్ డమ్ మాత్రం రాలేదు. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ ఇండస్ట్రీపై కన్నేసింది.

Rajitha Chanti
|

Updated on: Nov 13, 2024 | 1:34 PM

Share
తెలుగులో అనేక చిత్రాల్లో నటించి మెప్పించిన రాశీ ఖన్నా.. ఇప్పుడు హిందీలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తుంది. ప్రస్తుతం ఆమె ది సబర్మతీ రిపోర్ట్ చిత్రంలో నటిస్తుంది. ఇందులో 12th ఫెయిల్ హీరో విక్రాంత్ మాస్సే ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

1 / 5
గుజరాత్ అల్లర్లు, గోద్రా రైలు దహన కాండ ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ఇది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా రాశీ ఖన్నా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. అలాగే లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చింది.

2 / 5
వ్యక్తిగతంగా తాను చాలా ఎమోషనల్ పర్సన్ అని.. గతంలో తనకు ఓ లవ్ స్టోరీ ఉండేదని తెలిపింది. కానీ కొన్ని కారణాల వల్ల తన లవ్ బ్రేకప్ అయ్యిందని.. ఆ సమయంలో ఎంతో బాధపడ్డానని చెప్పుకొచ్చింది.

3 / 5
బ్రేకప్ కారణంగా కుంగుబాటుకు గురయ్యాను.. ఆ తర్వాత నన్ను నేను మార్చుకున్నాను.. స్ట్రాంగ్ గా నిలబడ్డాను.. కెరీర్ పై దృష్టి పెట్టాను. ఇండస్ట్రీలోకి బయటే నాకు ఎంతో మంది స్నేహితులు ఉన్నారని తెలిపింది.

4 / 5
కుటుంబసభ్యులు, స్నేహితులే తనకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తుంటారని.. వారే నా బలం అంటూ చెప్పుకొచ్చింది. దక్షిణాది ప్రేక్షకులు తనను ఎంతో ఆదరించారని చెప్పుకొచ్చింది. తెలుగులో రాశీ ఖన్నా మొదటి చిత్రం ఊహలు గుసగుసలాడే.

5 / 5