Singer Sunitha: సింగర్ సునీత కూతురిని చూశారా..? అందంలోనే కాదు, పాడడంలోనూ అమ్మను మించిపోయిందిగా..
సునీత పాడిన పాటలెన్నో ఇప్పటికీ యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్ అవుతుంటాయి.. గులాబీ సినిమాలోని ఈ వేళలో నీవు ఏంచేస్తుంటావు పాటతో సినీ సంగీత ప్రపంచంలో అడుగుపెట్టిన సునీత ఇప్పటివరకు ఎన్నో వందలాది పాటలతో శ్రోతలను మంత్రముగ్దులను చేసింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు సునీత. నిత్యం ఏదోక విషయాన్ని, ఫోటోలను నెటిజన్లతో పంచుకుంటారు.

సింగర్ సునీత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అద్భుతమైన గాత్రంతో శ్రోతలను మైమరపిస్తుంటుంది. ఎన్నో పాటలకు తన అందమైన గాత్రంతో ప్రాణం పోసింది. మనసుకు ప్రశాంతత కలిగిస్తూ సంగీత ప్రపంచంలో వందలాది పాటలు పాడి.. ఎన్నో అవార్డులు అందుకుంది. కేవలం గాయనిగానే కాకుండా.. డబ్బింగ్ ఆర్టిస్టుగా అనేక పాత్రలకు తన వాయిస్ అందించింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లకు సునీత డబ్బింగ్ చెప్పారు. అలాగే బుల్లితెరపై సింగింగ్ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తుంది. చాలా మంది అప్ కమింగ్ సింగర్స్ కు మార్గదర్శకంగా మారారు. సునీత పాడిన పాటలెన్నో ఇప్పటికీ యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్ అవుతుంటాయి.. గులాబీ సినిమాలోని ఈ వేళలో నీవు ఏంచేస్తుంటావు పాటతో సినీ సంగీత ప్రపంచంలో అడుగుపెట్టిన సునీత ఇప్పటివరకు ఎన్నో వందలాది పాటలతో శ్రోతలను మంత్రముగ్దులను చేసింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు సునీత. నిత్యం ఏదోక విషయాన్ని, ఫోటోలను నెటిజన్లతో పంచుకుంటారు.
ఈ క్రమంలోనే ప్రస్తుతం సింగర్ సునీత కూతురి ఫోటోస్, వీడియోస్ నెట్టింట వైరలవుతున్నాయి. సింగర్ సునీత చాలా ఏళ్ల క్రితమే భర్తతో విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి తన కూతురు శ్రేయ, కుమారుడు ఆకాష్ ఇద్దరిని చూసుకుంటున్నారు. ఇప్పటికే తనయుడు ఆకాష్ సర్కార్ నౌకరి సినిమా ద్వారా హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు. మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చిన ఆకాష్ నటనపరంగా మంచి మార్కులు కొట్టేశాడు. ఇక కూతురు శ్రేయ అందంలో తల్లిని మించిపోయింది.
ప్రస్తుతం ఉన్నత చదువుతున్న శ్రేయ.. ఇప్పటికే నాగచైతన్య నటించిన సవ్యసాచి సినిమాలో టిక్ టిక్ టిక్ అనే పాట పాడింది. అలాగే తన ఇన్ స్టాలో పలు పాటలు పాడుతూ వీడియోస్ షేర్ చేస్తుంది. శ్రేయ వినసొంపైన గాత్రంతో పాటలు పాడుతూ అలరిస్తుంది. శ్రేయ షేర్ చేసిన వీడియోస్ చూస్తుంటే మున్ముందు ఇండస్ట్రీలో సింగర్ గా రాణించడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రస్తుతం శ్రేయ వీడియోస్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




