AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోజూ ఒక జామకాయ తింటే ఏమౌతుందో తెలుసా..? శరీరంలో వచ్చే మార్పులు ఇవే..

ఏడాది పొడవునా లభించే పండ్లలో జామకాయ ఒకటి.. జామకాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. విటమిన్ సీ, అధిక ఫైబర్‌తోపాటు.. ఇతర పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా ఉన్న ఈ పండు అంటే.. స‌హ‌జంగానే చాలా మందికి ఎంతో ఇష్టం.. అయితే.. ముఖ్యంగా చలికాలంలో జామకాయలు ఎక్కువగా లభిస్తాయి..

రోజూ ఒక జామకాయ తింటే ఏమౌతుందో తెలుసా..? శరీరంలో వచ్చే మార్పులు ఇవే..
ముఖ్యంగా సాయంత్రం లేదా రాత్రి సమయంలో జామపండ్లను అస్సలు తినకూడదు. కడుపులో గ్యాస్, ఆమ్లత్వంతో బాధపడేవారు కూడా ఎక్కువగా జామపండు తినకూడదు. ఈ సమస్య ఉన్నవారు జామ విత్తనాలను తొలగించి తినడం మంచిది. లేకుంటే కడుపు నొప్పి వస్తుంది.
Shaik Madar Saheb
|

Updated on: Dec 11, 2025 | 7:10 PM

Share

ఏడాది పొడవునా లభించే పండ్లలో జామకాయ ఒకటి.. జామకాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. విటమిన్ సీ, అధిక ఫైబర్‌తోపాటు.. ఇతర పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా ఉన్న ఈ పండు అంటే.. స‌హ‌జంగానే చాలా మందికి ఎంతో ఇష్టం.. అయితే.. ముఖ్యంగా చలికాలంలో జామకాయలు ఎక్కువగా లభిస్తాయి.. ఈ సీజన్‌లో తక్కువ ధరకే జామపండు లభిస్తుంది. పోటిషియంతోపాటు.. అనేక పోషకాలు కలిగిన జామ‌కాయ‌ను క‌నీసం రోజుకు ఒక‌టి అయినా తినాలంటుననారు ఆరోగ్య నిపుణులు.. ముఖ్యంగా ఈ శీతాకాలంలో జామ‌కాయ‌ల‌ను తిన‌డం వల్ల మ‌న‌కు ఎన్నో అద్భుత‌మైన ప్రయోజనాలు లభిస్తాయి..

రోజూ జామకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..

రోగనిరోధక శక్తి పెరుగుతుంది: జామ‌కాయ‌ల్లో విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉంటుంది. దీని వల్ల రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అయి.. ప‌టిష్టంగా మారుతుంది.. ఇది .. సాధారణ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. ముఖ్యంగా ద‌గ్గు, జ‌లుబు, ఫ్లూ నుంచి ఉప‌శ‌మ‌నం అందిస్తుంది.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది: జీర్ణక్రియను మెరుగు ప‌ర‌చ‌డంలో జామ‌కాయ‌లు ఎంతో ఉపయోగ‌ప‌డ‌తాయి. ఈ కాయ‌ల్లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. ఇది కడుపును శుభ్రపరిచి.. విరేచ‌నం స‌రిగ్గా అయ్యేలా చేస్తుంది. దీంతో మ‌ల‌బ‌ద్దకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

బరువును తగ్గించి కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది: జామ‌కాయ‌లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా లైకోపీన్ ఎక్కువ‌గా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిల‌ను త‌గ్గిస్తుంది. జామపండులోని తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ బరువు తగ్గడంలో సహాయపడతాయి..

గుండెకు మేలు చేస్తుంది: జామపండులోని పోషకాలు పొటాషియం రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది.. లైకోపీన్ ఆక్సీక‌ర‌ణ ఒత్తిడిని కూడా దూరం చేసి.. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

డయాబెటిస్‌లో మేలు చేస్తుంది: డ‌యాబెటిస్ ఉన్నవారికి జామ‌కాయ‌లు ఎంతో మేలు చేస్తాయి.. ఈ జామకాయ త‌క్కువ గ్లైసీమిక్ ఇండెక్స్‌ను క‌లిగి ఉంటుంది.. అలాగే.. ఫైబ‌ర్ స‌మృద్ధిగా ఉంటుంది. దీనిని రోజు ఒకటి తినడం వల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. డయాబెటిస్ కూడా నియంత్రణలో ఉంటుంది.

ఒత్తిడి నుంచి ఉపశమనం: జామలోని పోషకాలు ఒత్తిడి, ఆందోళ‌న నుంచి ఉప‌శ‌మ‌నం కలిగిస్తాయి.. దడు చురుకుదనాన్ని పెంచి.. చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతాయి..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..