Malavika Mohanan: ఎండలో షూటింగ్.. శరీరంపై దద్దుర్లతో ఇబ్బంది పడిన హీరోయిన్..
కోలీవుడ్ హీరో విక్రమ్ హీరోగా నటించిన చిత్రం తంగలాన్. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కార్మికుల జీవితాల ఆధారంగా డైరెక్టర్ పా.రంజిత్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో మాళవిక మోహనన్, పార్వతి తిరువోతు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆగస్ట్ 15న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్.