AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhanush: ఎలాంటి టాలెంట్ లేకపోయినా నెట్టుకొచ్చారు.. ధనుష్‏ను ట్రోల్ చేస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..

ధనుష్ నటించిన రాయన్ సినిమా అడియన్స్ ముందుకు రాబోతుంది. ఇందులో తెలుగు హీరో సందీప్ కిషన్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా జూలై 26న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా చెన్నైలో ఆడియో లాంచ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ సందర్భంగా తన కెరీర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు ధనుష్.

Dhanush: ఎలాంటి టాలెంట్ లేకపోయినా నెట్టుకొచ్చారు.. ధనుష్‏ను ట్రోల్ చేస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
Dhanush
Rajitha Chanti
|

Updated on: Jul 25, 2024 | 7:32 AM

Share

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‏కు దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. తమిళంలో అనేక హిట్ సినిమాల్లో నటించగా.. ఆత్రంగి రే సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. గతేడాది సార్ సినిమాతో నేరుగా తెలుగు అడియన్స్ ముందుకు వచ్చాడు. హిందీ, తమిళం, తెలుగు భాషలలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర చిత్రంలో నటిస్తున్నారు. అలాగే ధనుష్ నటించిన రాయన్ సినిమా అడియన్స్ ముందుకు రాబోతుంది. ఇందులో తెలుగు హీరో సందీప్ కిషన్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా జూలై 26న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా చెన్నైలో ఆడియో లాంచ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ సందర్భంగా తన కెరీర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు ధనుష్.

తన కెరీర్ లో ఇప్పటివరకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. వీధుల్లో పెరిగిన తాను పోయెస్ గార్డెన్ లో కోట్ల విలువ చేసే ఇంటిని కొనుగోలు చేశానని వెల్లడించారు. అంతేకాకుండా సూపర్ స్టార్ రజినీకాంత్, జయలలిత లాంటి దిగ్గజాలు ఉండే ప్రాంతంలో ఇంటిని కొన్నట్లు తెలిపారు. “నాకు 16 ఏళ్ల వయసున్నప్పుడు పోయెస్‌ గార్డెన్‌లో నా స్నేహితుడితో కలిసి రజినీకాంత్, జయలలిత ఇళ్లు చూసేందుకు వచ్చాను. అప్పుడు అక్కడున్న కొందరు రజినీకాంత్ ఇళ్లు, జయలలిత ఇల్లు అని చూపించారు. ఇంత పెద్ద ఇంటిని కొనగలనా ? అని మనసులో అనుకున్నాను. ఏదో ఒకరోజు ఈ ప్రాంతంలో కనీసం చిన్న ఇల్లు అయినా కొనాలను నిర్ణయించుకున్నాను. ” అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ధనుష్ చేసిన కామెంట్స్ పై నెటిజన్స్ మండిపడుతున్నారు.

ఎందుకంటే తాను వీధుల్లో పెరిగానని ధనుష్ చెప్పాడు. కానీ ధనుష్ ఫ్యామిలీకి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. ధనుష్ సినిమా కుటుంబానికి చెందినవాడు. ధనుష్ తండ్రి కస్తూరి రాజా తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే ధనుష్ అన్నయ్య కూడా దర్శకుడే. దీంతో ధనుష్ కు మొదటినుంచి అవకాశాలు సులభంగానే వచ్చాయని.. కానీ ఇప్పుడేం వీధుల్లో నుంచి వచ్చానని చెప్పడం కామెడీగా ఉందంటూ విమర్శిస్తున్నారు నెటిజన్స్. ధనుష్ లాంటి నేపో పిల్లలు కష్టాల గురించి మాట్లాడతారు. మీ కుటుంబం సినీ పరిశ్రమలో ఉంది. కాబట్టి, టాలెంట్ లేకపోయినా మీకు సులభంగా అవకాశం వచ్చింది. నేను వీధిలో ఉన్నానని మీరు చెప్పారు. వీధి ఎలా ఉంటుందో తెలుసా?’ అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భారత్‌లో అమ్ముడవుతున్న అత్యంత ఖరీదైన కారు..ధర తెలిస్తే షాకవుతారు
భారత్‌లో అమ్ముడవుతున్న అత్యంత ఖరీదైన కారు..ధర తెలిస్తే షాకవుతారు
పొద్దున్నే చాయ్ బిస్కెట్లు తింటున్నారా..? ఎంత డేంజరో తెలుసుకోండి!
పొద్దున్నే చాయ్ బిస్కెట్లు తింటున్నారా..? ఎంత డేంజరో తెలుసుకోండి!
గేమ్‌ ఛేంజర్‌ ప్రాజెక్ట్‌ మొదలుపెట్టిన రేవంత్ సర్కార్..!
గేమ్‌ ఛేంజర్‌ ప్రాజెక్ట్‌ మొదలుపెట్టిన రేవంత్ సర్కార్..!
భారత క్రికెట్ చరిత్రలోనే తొలిసారి...బూమ్రా సంచలన రికార్డు
భారత క్రికెట్ చరిత్రలోనే తొలిసారి...బూమ్రా సంచలన రికార్డు
మహిళలకు గుడ్‌న్యూస్‌.. దిగి వస్తున్న బంగారం ధరలు..!
మహిళలకు గుడ్‌న్యూస్‌.. దిగి వస్తున్న బంగారం ధరలు..!
కొత్త ఏడాదిలో కార్‌ కొనాలని అనుకున్న వాళ్లకే పండగే!
కొత్త ఏడాదిలో కార్‌ కొనాలని అనుకున్న వాళ్లకే పండగే!
కాలికి నల్ల దారం కడుతున్నారా?.. అయితే జాగ్రత్త.. ఎందుకంటే?
కాలికి నల్ల దారం కడుతున్నారా?.. అయితే జాగ్రత్త.. ఎందుకంటే?
ప్రతి ఒక్కరూ చూడాలి.. ఆ స్టార్ హీరో మూవీపై రేణూ దేశాయ్ ప్రశంసలు
ప్రతి ఒక్కరూ చూడాలి.. ఆ స్టార్ హీరో మూవీపై రేణూ దేశాయ్ ప్రశంసలు
ఓలాను తొక్కేస్తున్న హీరో..! అమ్మకాల్లో దూసుకెళ్తూ..
ఓలాను తొక్కేస్తున్న హీరో..! అమ్మకాల్లో దూసుకెళ్తూ..
Horoscope Today: ముఖ్యమైన చిక్కు సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: ముఖ్యమైన చిక్కు సమస్యల నుంచి వారికి విముక్తి..