డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా జానీ మాస్టర్ సతీమణి
తెలుగు ఫిల్మ్ డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సతీమణి సుమలత (ఆయేషా) ఘనవిజయం సాధించారు. గతంలో జానీ మాస్టర్‌పై లైంగిక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, ఆయన్ను వ్యతిరేకించిన వారే ఇప్పుడు ఆయన భార్యకు మద్దతివ్వడం చర్చనీయాంశంగా మారింది. వివాదాలను దాటుకొని జానీ మాస్టర్ తిరిగి బిజీగా మారగా, ఆయన భార్య సుమలత ఎన్నిక కావడంతో ఈ వ్యవహారం ఆసక్తి రేపుతోంది.
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సతీమణి సుమలత అలియాస్ ఆయేషా తెలుగు ఫిల్మ్ డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో సుమలత తన ప్రత్యర్థి జోసెఫ్ ప్రకాష్ మాస్టర్‌పై 29 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. గతంలో జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన సమయంలో ఆయన్ను అసోసియేషన్ నుంచి తొలగించాలని డిమాండ్ చేసిన వారే ఇప్పుడు ఆయన భార్యకు మద్దతుగా నిలవడం గమనార్హం. ఈ వివాదాల తర్వాత జానీ మాస్టర్ ఫేడ్ అవుట్ అవుతారని అంతా భావించారు. అయితే, ఆయన అన్నిటినీ దాటుకొని తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో అవకాశాలు అందుకుంటూ తిరిగి బిజీ అయ్యారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డీప్‌ఫేక్ కంటెంట్.. టేక్ యాక్షన్.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
TVK సభకు గన్ తో వచ్చిన వ్యక్తి.. అదుపులోకి తీసుకున్న పోలీసులు
Gold Price Today: మంగళవారం బంగారం, వెండి ధరలు ఇలా
అల్లూరి జిల్లాలో ఆకట్టుకుంటున్న భీముని రాయి
సై అంటే సై అంటున్న అన్నదమ్ములు.. తొడగొడుతున్న తోటికోడళ్లు
సర్పంచ్ కుర్చీ కోసం సతి Vs పతి
ఈ తల్లి కథ తెలిస్తే గుండె తరుక్కుపోతుంది
వారి కాలి స్పర్శ తగిలితే దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయా !!
చాట్ జీపీటీ తో స్కామర్ కి.. చుక్కలు చూపిన ఢిల్లీ యువకుడు
కాలేజ్‌లో యువతుల సిగపట్లు.. ఇంతకీ గొడవ ఏంటంటే

