నిద్రలో కూడా అవే కలలు.. అది ఇంకా మర్చిపోలేకపోతున్న
08 December 2025
Pic credit - Instagram
Phani Ch
2021లో కన్నడ చిత్రం "మొగిల్‌పేట"తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. "పాథోన్‌పథం నూట్టండు" (2022) చిత్రంతో మలయాళంలో సూపర్ హిట్ అందుకుంది.
తాజాగా వచ్చిన డ్రాగన్ సినిమాతో బాగా పేరు తెచ్చుకుంది. ఈ చిత్రంలో కాయదు గ్లామర్ తో కుర్రకారు గుండెల్లో సెగలు రేపింది.
ప్రస్తుతం తెలుగు, మరాఠీ, తమిళ్ చిత్రాల్లో బిజీ అయ్యిపోయింది. "థారం" మరియు "ఇధయం మురళి" వంటి చిత్రాలతో మరింత బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ.
తమిళనాడులో పెద్ద సంచలనం సృష్టించిన టాస్మాక్ కుంభకోణంలో కయదు లోహర్ పేరు వినిపించిన స్సంగతి తెలిసిందే.
టాస్మాక్ స్కామ్‌లో ఉన్నవారు నిర్వహించిన పార్టీలకు కయదు హాజరయ్యిందని, అందుకుగానూ ఆమె రూ. 35 లక్షలు తీసుకుందని వార్తలు వచ్చాయి.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో కయదు లోహర్ మాట్లాడుతూ..' సినీ పరిశ్రమలో ఎలాంటి సపోర్ట్ లేకుండా వచ్చిన తనపై బ్లాక్ మార్క్స్ వేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
నిద్రలో కూడా జనాలు తన గురించి మాట్లాడుకుంటున్నవే గుర్తొస్తున్నాయని పేర్కొంది. ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు అసలు బాధ లేకుండా ఈజీగా తీసుకుంటారని అనుకుంటారు. కానీ అది చాలా కష్టమని ఆమె వివరించింది.