Jasprit Bumrah : భారత క్రికెట్ చరిత్రలోనే తొలిసారి…బూమ్రా సంచలన రికార్డు
Jasprit Bumrah : భారత ఫాస్ట్ బౌలింగ్ సంచలనం జస్ప్రీత్ బుమ్రా సౌతాఫ్రికాతో జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ మొదటి మ్యాచ్‌లో బంతిని అందుకోగానే మరో చారిత్రక ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో అతను తన మొదటి వికెట్ తీయగానే రికార్డు సొంతమైంది.

Jasprit Bumrah : భారత ఫాస్ట్ బౌలింగ్ సంచలనం జస్ప్రీత్ బుమ్రా సౌతాఫ్రికాతో జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ మొదటి మ్యాచ్‌లో బంతిని అందుకోగానే మరో చారిత్రక ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో అతను తన మొదటి వికెట్ తీయగానే, టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఇప్పటివరకు ఏ భారతీయ బౌలర్ కూడా సాధించని అరుదైన రికార్డును నెలకొల్పాడు.
సౌతాఫ్రికా మ్యాచ్‌లో బుమ్రా తన మొదటి వికెట్‌ను తీయడం ద్వారా తన టీ20 కెరీర్‌లో 100 వికెట్ల మైలురాయిని పూర్తి చేశాడు. ఈ ఘనత సాధించిన భారతీయ బౌలర్‌లలో అర్ష్‌దీప్ సింగ్ తర్వాత బుమ్రా రెండో స్థానంలో ఉన్నాడు. అయితే బుమ్రా ఈ మైలురాయిని కేవలం 81 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనే అందుకోవడం విశేషం. ఇది అతని నిలకడైన, అత్యంత ప్రమాదకరమైన బౌలింగ్‌కు నిదర్శనం.
ఈ రికార్డులో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే.. జస్ప్రీత్ బుమ్రా ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్‌లలో (టెస్ట్, వన్డే, టీ20) 100 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన మొదటి భారతీయ బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. బుమ్రా ఇప్పటికే టెస్టుల్లో 234 వికెట్లు, వన్డేల్లో 149 వికెట్లు తీశాడు. మూడు ఫార్మాట్‌లలో 100+ వికెట్లు తీసిన బౌలర్ల జాబితా ప్రపంచ క్రికెట్‌లో చాలా చిన్నదిగా ఉంది. ఇప్పుడు ఆ అరుదైన జాబితాలో భారత క్రికెట్ తరపున బుమ్రా పేరు కూడా చేరింది.
ప్రపంచవ్యాప్తంగా బుమ్రాకు ముందు ఈ ఘనత సాధించిన బౌలర్లు వీరే:
లసిత్ మలింగ (శ్రీలంక): టెస్ట్ (101 వికెట్లు), వన్డే (338 వికెట్లు), టీ20 (107 వికెట్లు)
టిమ్ సౌథీ (న్యూజిలాండ్): టెస్ట్ (391 వికెట్లు), వన్డే (221 వికెట్లు), టీ20 (164 వికెట్లు)
షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్): టెస్ట్ (246 వికెట్లు), వన్డే (317 వికెట్లు), టీ20 (149 వికెట్లు)
షాహీన్ అఫ్రిది (పాకిస్తాన్): టెస్ట్ (121 వికెట్లు), వన్డే (135 వికెట్లు), టీ20 (126 వికెట్లు)
జస్ప్రీత్ బుమ్రా (భారత్): టెస్ట్ (234 వికెట్లు), వన్డే (149 వికెట్లు), టీ20 (101* వికెట్లు)
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




