Tamannah: వామ్మో.. తమన్నా ఇరగదీసింది.. హారర్ కామెడీలో మిల్కీబ్యూటీ స్పెషల్ సాంగ్..
ఇన్నాళ్లు తెలుగులో పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ ద్వారా అలరించిన తమన్నా.. కేజీఎఫ్, జైలర్ వంటి హిట్ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ అదరగొట్టింది. ఇప్పుడు బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ స్త్రీ 2లో మిల్కీబ్యూటీ గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చింది. తాజాగా స్త్రీ 2 నుంచి తమన్నా స్పెషల్ సాంగ్ రిలీజ్ చేయగా.. అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో తమన్నా డాన్స్ చూసి అడియన్స్ ఫిదా అవుతున్నారు.

టాలీవుడ్ హీరోయిన్ తమన్నా ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో చాలా బిజీగా ఉంటుంది. తెలుగుతోపాటు అటు హిందీలోనూ వరుస ఆఫర్స్ అందుకుంటుంది. వెండితెరపైనే కాకుండా ఓటీటీలోనూ సత్తా చాటుతుంది. ఓవైపు కథానాయికగా.. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతోపాటు వెబ్ సిరీస్ అంటూ తెగ హడావిడి చేస్తున్న తమన్నా.. ఇప్పుడు మరోసారి స్పెషల్ సాంగ్ అదరగొట్టేసింది. ఇన్నాళ్లు తెలుగులో పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ ద్వారా అలరించిన తమన్నా.. కేజీఎఫ్, జైలర్ వంటి హిట్ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ అదరగొట్టింది. ఇప్పుడు బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ స్త్రీ 2లో మిల్కీబ్యూటీ గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చింది. తాజాగా స్త్రీ 2 నుంచి తమన్నా స్పెషల్ సాంగ్ రిలీజ్ చేయగా.. అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో తమన్నా డాన్స్ చూసి అడియన్స్ ఫిదా అవుతున్నారు.
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావ్, అపరశక్తి ఖురానా, అభిషేక్ బెనర్జీ, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఆగస్ట్ 15న విడుదల కానుంది. 2018లో వచ్చిన సూపర్ హిట్ స్త్రీ సినిమాకు సీక్వెల్ గా ఈ మూవీని రూపొందించారు. స్త్రీ సినిమాలో బీటౌన్ బ్యూటీ నోరా ఫతేహి స్పెషల్ సాంగ్ చేయగా.. ఇప్పుడు ఆ సీక్వెల్‌లో తమన్నా భాటియాకు అవకాశం వచ్చింది. అమర్ కౌశిక్ ‘స్త్రీ 2’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి దినేష్ విజన్ నిర్మాతగా వ్యవహరించగా.. కొన్ని రోజులుగా ప్రమోషన్స్ భారీగా జరుగుతున్నాయి.
ఆరేళ్ల క్రితం స్త్రీ సినిమా సూపర్ హిట్ కావడంతో స్త్రీ 2పై మరింత హైప్ పెరిగింది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ మూవీపై మరిన్ని అంచనాలు పెంచగా.. ఇప్పుడు విడుదలైన స్పెషల్ సాంగ్ ఆకట్టుకుంటుంది. యూట్యూబ్ లో మిలియన్స్ కొద్దీ వ్యూస్ రాబట్టింది. గతంలో జైలర్ సినిమాలోని తమన్నా చేసిన కావాలయ్యా పాట కూడా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




