ఇండిగో విమాన సంక్షోభం క్రమంగా కొలిక్కి వస్తోంది. వందలాది విమానాలను రద్దు చేసిన ఇండిగో, ప్రస్తుతం రోజుకు 1500-1650 సర్వీసులను నడుపుతోంది. ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, బెంగళూరు ఎయిర్‌పోర్టులలో కార్యకలాపాలు మెరుగుపడుతున్నాయి. ఇప్పటికే ₹610 కోట్ల రీఫండ్లు జరిగాయి. సోమవారం రాత్రికల్లా రీఫండ్లు, తప్పిపోయిన లగేజీల పంపిణీ పూర్తి చేస్తామని ఇండిగో ప్రకటించింది.