AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: అన్నయ్య మనసు ‘బంగారం’.. మేనేజర్ కుమార్తెకు చిరంజీవి ఖరీదైన గిఫ్ట్.. గోల్డ్ చైన్‌తో పాటు.. వీడియో

మెగాస్టార్ చిరంజీవి గొప్పతనం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందరికో ఎన్నో విధాలుగా సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నారాయన. బ్లడ్ బ్యాంకులు, ఐ బ్యాంకులు, ఆక్సిజన్ బ్యాంకులతో ఎంతో మందికి ప్రాణం పోశారు చిరంజీవి. తాజాగా ఆయన మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు.

Chiranjeevi: అన్నయ్య మనసు 'బంగారం'.. మేనేజర్ కుమార్తెకు చిరంజీవి ఖరీదైన గిఫ్ట్.. గోల్డ్ చైన్‌తో పాటు.. వీడియో
Megastar Chiranjeevi
Basha Shek
|

Updated on: Dec 08, 2025 | 7:47 PM

Share

భోళా శంకర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. త్వరలోనే ఆయన మనశంకర వరప్రసాద్‌ గారు గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయన తార హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే విక్టరీ వెంకటేష్ కూడా మరో హీరోగా కనిపించనున్నాడు. ఇ‍ప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మీసాల పిల్ల, శఖి రేఖ పాటలకు ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న మనశంకర వరప్రసాద్‌ గారు సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు చిరంజీవి చేతిలో విశ్వంభర సినిమా కూడా ఉంది. అలాగే వాల్తేరు వీరయ్య డైరెక్టర్ కే.ఎస్. రవీంద్ర తో మరో సినిమాకు రెడీ అయ్యారు మెగాస్టార్.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగుల్లో బిజీ బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా తన మేనేజర్ స్వామినాథ్ కుమార్తె బారసాల వేడుకకు హాజరయ్యారు. సతీమణి సురేఖతో కలిసి ఈ వేడుకకు హాజరైన చిరంజీవి చిన్నారికి అలేఖ్య అని నామకరణం చేశారు. దీంతో మేనేజర్ దంపతులు ఆనందంతో ఎమోషనల్ అయ్యారు. ఇదే సందర్భంగా చిరు దంపతులు తమ గొప్ప ప్రేమను చాటుకున్నారు. ఆ చిన్నారికి ఖరీదైన కానుక అందించారు. ఆ చిట్టి తల్లికి గోల్డ్ చైన్‌ బహుకరించారు. దీంతో పాటు దాదాపు కోటి రూపాయల విలువైన ల్యాండ్ కానుకగా ఇచ్చారని టాక్ వినిపిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే కోటి రూపాయల ల్యాండ్ పై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

 మేనేజర్ కూతురి నామకరణ మహోత్సవంలో మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు.. వీడియో..

టాప్ ట్రెండింగ్ లో చిరంజీవి, నయనతార శశిరేఖ సాంగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మేనేజర్ కుమార్తెకు మెగాస్టార్ చిరంజీవి ఖరీదైన గిఫ్ట్.. వీడియో
మేనేజర్ కుమార్తెకు మెగాస్టార్ చిరంజీవి ఖరీదైన గిఫ్ట్.. వీడియో
దేశమే ముఖ్యం: ఆ బాధలోనూ గ్రౌండ్‌లో దిగిన స్మృతి మంధాన..!
దేశమే ముఖ్యం: ఆ బాధలోనూ గ్రౌండ్‌లో దిగిన స్మృతి మంధాన..!
అర్థరాత్రి ఇంటికెళ్తుండగా వెంటపడ్డ కుక్కలు.. కట్‌చేస్తే..
అర్థరాత్రి ఇంటికెళ్తుండగా వెంటపడ్డ కుక్కలు.. కట్‌చేస్తే..
ఢిల్లీ వెళ్తున్నారా.? ఆ హిల్ స్టేషన్స్ మిస్ కావద్దు..
ఢిల్లీ వెళ్తున్నారా.? ఆ హిల్ స్టేషన్స్ మిస్ కావద్దు..
కిరాక్ మామ.. కిరాక్.. 10 సెకన్లలో పిల్లిని కనిపెడితే మీరు తోపులే
కిరాక్ మామ.. కిరాక్.. 10 సెకన్లలో పిల్లిని కనిపెడితే మీరు తోపులే
ఇండిగో సంక్షోభం.. ఎయిరిండియా నుంచి కీలక ప్రకటన
ఇండిగో సంక్షోభం.. ఎయిరిండియా నుంచి కీలక ప్రకటన
యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారా..? ఇలా చేస్తే వెంటనే ఉపశమనం
యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారా..? ఇలా చేస్తే వెంటనే ఉపశమనం
తిరుమల శ్రీవారికి 100 కోట్ల ఆస్తిని ఇచ్చేసిన టాలీవుడ్ నటి..
తిరుమల శ్రీవారికి 100 కోట్ల ఆస్తిని ఇచ్చేసిన టాలీవుడ్ నటి..
ఒక్క కార్డుతో బస్సులో రాయితీ, ట్రైన్స్‌లో బెర్త్.. ఎలా పొందాలంటే
ఒక్క కార్డుతో బస్సులో రాయితీ, ట్రైన్స్‌లో బెర్త్.. ఎలా పొందాలంటే
హైదరాబాద్ చేరువలోనే వైజాగ్.. 3 గంటలే జర్నీ.. ఒక్కరోజు ట్రిప్‎కి..
హైదరాబాద్ చేరువలోనే వైజాగ్.. 3 గంటలే జర్నీ.. ఒక్కరోజు ట్రిప్‎కి..