OTT Movie: ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో తమిళ క్రైమ్ థ్రిల్లర్.. ట్విస్టులతో మతిపోగొట్టే సిరీస్.. తెలుగులోనూ చూడొచ్చు
ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన ఈ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఆడియెన్స్ కు మంచి థ్రిల్ ఇస్తోంది. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగే సన్నివేశాలు, ఊహించని ట్విస్టులతో సాగే ఈ తమిళ సిరీస్ ఇప్పుడు ఓటీటీ టాప్ ట్రెండింగ్ లో దూసుకెళ్లిపోతోంది. ఈ సిరీస్ తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.

గతవారం పలు కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. అందులో ఒక తమిళ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. డిసెంబర్ 4 నుంచి ఓటీటీ ప్లాట్‌ఫాంలోకి వచ్చిన ఈ సిరీస్ ప్రస్తుతం హయ్యెస్ట్ వ్యూస్తో దూసుకెళ్తోంది. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగే ఈ సిరీస్ లో కల్కి నటుడు పశుపతి ప్రధాన పాత్ర పోషించారు. సిరీస్ మొత్తం అతని చుట్టే సాగుతుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఫార్మసిస్ట్‌గా పనిచేస్తుంటాడు భాస్కర్ (పశుపతి). మధ్యతరగతి కుటుంబానికి చెందిన అతని మనవడు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతుంటాడు. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని తద్వారా వచ్చిన డబ్బుతో మనవడికి చికిత్స చేయించాలని అనుకుంటాడు భాస్కర్. వీరింటి పక్కనే లక్ష్మీ ప్రియ చంద్రమౌళి కుటుంబం ఉంటుంది. భర్త ఎప్పుడూ భార్యను వేధిస్తూ ఉంటాడు. వీరికి మెర్సీ అనే కుమార్తె ఉంటుంది. భాస్కర్, లక్ష్మీ ప్రియ ఫ్యామిలీలు ఒకే కుటుంబంలా కలిసిమెలిసి ఉంటారు. మరోవైపు పోలీసు అయిన గౌతమ్ అనుకోని చిక్కుల్లో పడతాడు. విధుల నుంచి సస్పెన్షన్‌కు గురవుతాడు. ఈ క్రమంలో ఓ రోజు అనుకోకుండా లక్ష్మీ ప్రియ భర్త శవమై కనిపిస్తాు. మెర్సీ కూడా అపహరణకు గురవుతుంది. పాప కోసం వెతుకుతుండగా.. ఓ ప్రదేశంలో స్పృహ లేకుండా పడి కనిపిస్తుంది. ఆమెపై ఎవరో అత్యాచారం చేసిన ఆనవాళ్లు కూడా ఉంటాయి. దాంతో, పోలీసులు విచారణ ప్రారంభిస్తారు. అందరూ పక్కింట్లో ఉండే భాస్కర్‌ను అనుమానిస్తారు.
అసలు ఎలాంటి సమస్యల్లో తలదూర్చని భాస్కర్ కు మెర్సీ కేసు మెడకు చుట్టుకుంటుంది. ఇదే సమయంలో మనవడికి సర్జరీ చేయించాల్సి వస్తుంది. మరి ఈ కఠిన పరిస్థితులను భాస్కర్ ఎలా అధిగమించాడు? అసలు మెర్సీ తండ్రిని చంపి, ఆమెపై అఘాయిత్యం చేసిందెవరు? గౌతమ్ కు ఈ కేసుకు సంబంధమేంటి? అనేది తెలుసుకోవాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.
ఆద్యంతం గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ పేరు ‘కుట్రమ్ పురింధవన్’. ‘ది గిల్టీ వన్’ అనేది క్యాప్షన్. కల్కిఫేమ్ పశుపతి ఇందులో ప్రధాన పాత్ర పోషిచాడు. అలాగే విదార్థ్, లిజ్జీ ఆంటోనీ, లక్ష్మీ ప్రియ చంద్రమౌళి, అజిత్ కోషీ, మున్నార్ రమేష్ తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. ప్రస్తుతం ఈ సిరీస్ సోని లివ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.
సోని లివ్ లో స్ట్రీమింగ్..
Guilty? Innocent? Or just caught in the crossfire of truth?
Watch Kuttram Purindhavan, now streaming on Sony LIV.@Avinaash_Offi @ArabbhiA @Happyunicorn_23 @aquabulls @Dir_Selva @farookjbasha @prasad_sn_ @editorkathir @Im_Shreeram @bhargavkiyer @RitheshSelvaraj #VasudhevanK pic.twitter.com/LTzwU3NVnT
— Sony LIV (@SonyLIV) December 7, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








