AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: బాబ్రీ మసీదు నగదు అంశంపై తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

సస్పెండ్ అయిన తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ తన సంచలన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు. బాబ్రీ మసీదుకు శంకుస్థాపన కార్యక్రమం నిన్న ప్రారంభమైందని.. బాబ్రీ మసీదు నిర్మాణానికి నిధుల సేకరణ కార్యక్రమం డిసెంబర్ 6, 2025న ప్రారంభమైందని.. ఆ రోజు బాబ్రీ మసీదుకు శంకుస్థాపన కార్యక్రమం జరిగిందని మీడియా వేదికగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వార్త దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.

Watch: బాబ్రీ మసీదు నగదు అంశంపై తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Viral News
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Dec 08, 2025 | 11:02 PM

Share

ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలవడం ఇదేం కొత్త కాదు. మొన్నటికి మొన్న.. తృణమూల్ కాంగ్రెస్‌ ముస్లిం ఓటు బ్యాంకు ముగిసిపోతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘పిక్చర్ అభి బాకీ హై’ అంటూ కామెంట్లు చేయడం వివాదాస్పదంగా మారింది. హుమాయున్ కబీర్ నుంచి బాబ్రీ మసీదు ప్రకటన వెలువడిన వెంటనే పార్టీ నుంచి ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్టు టీఎంసీ ఓ ప్రకటన జారీ చేసింది. దీంతో డిసెంబర్ 22న కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్టు కబీర్ వెల్లడించారు.

ఈ రాజకీయ పరిణామాల నడుమ తాజాగా కబీర్ బాబ్రీ మసీదు వ్యాఖ్యలు మరోసారి దుమారం రేపాయి. బాబ్రీ మసీదు విరాళాలకు సంబంధించి నిధులు ఒక్క రోజులోనే హుమాయున్ ఇంట్లో పేరుకుపోయినట్లు తెలుపుతున్నట్లు ఉన్న ఓ వీడియోని హుమాయున్ కబీర్ తన ఫేస్‌బుక్ ఖాతా నుంచి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మొత్తం 11 ట్రంక్‌ల విరాళాలు సేకరించినట్లు హుమాయున్ కబీర్ ఈ సందర్భంగా తెలిపారు. QR కోడ్ ద్వారా అతని బ్యాంకు ఖాతాలో రూ.9.3 మిలియన్లు జమ చేసినట్లు.. అందుకోసం డబ్బును లెక్కించడానికి ముప్పై మందిని నియమించడానికి లెక్కింపు యంత్రాన్ని కూడా ఆ వీడియోలో చూపించారు.

బీజేపీ నుంచి వచ్చిన నిధులతోనే తాను ఈ మసీదును నిర్మిస్తున్నానని అందరూ మాట్లాడుతున్నారని, అది అబద్ధం అని నిరూపించడానికే తన ఈ ప్రత్యక్ష వీడియో నిదర్శనమని హుమాయున్ చెప్పడం గమనార్హం. డబ్బు లెక్కింపు ప్రక్రియ సీసీటీవీ పర్యవేక్షణలో జరుగుతుందని, తన బాబ్రీ మసీదును విరాళంగా వచ్చిన డబ్బుతోనే నిర్మిస్తామని హుమాయున్ కబీర్ వెల్లడించారు.

వీడియో చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా