పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో లక్షల మంది భక్తులు సామూహిక భగవద్గీత పారాయణం చేశారు. బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన ఈ కార్యక్రమాన్ని సనాతన సంస్కృతి సంసద్ నిర్వహించింది. రాష్ట్ర ఆధ్యాత్మిక వారసత్వాన్ని గుర్తుచేస్తూ, సామాజిక సామరస్యాన్ని పెంపొందించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం.