Telangana Cold Wave: తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతోంది. ఆదిలాబాద్లో 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదవ్వగా, ఇతర జిల్లాల్లోనూ గణనీయంగా పడిపోయాయి. వచ్చే రెండు రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరించింది. వృద్ధులు, పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.