నేను దెయ్యాన్ని చూసా..  దాంతో నాకు పరిచయం ఉంది: కృతి శెట్టి

08 December 2025

Pic credit - Instagram

Phani Ch

ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగింది తరువాత వరుస విజయాలతో హ్యాట్రిక్ పూర్తి చేసింది. కాకపోతే ఎంత వేగంగా ఎదిగిందో అంతే వేగంగా పడిపోయింది ఈ ముద్దగుమ్మ.

ఉప్పెన మూవీ ఒక సంచలనం. కొత్త దర్శకుడు బుచ్చిబాబు సాన మెగా హీరో వైష్ణవ్ తేజ్ ని పరిచయం చేస్తూ ఉప్పెన తెరకెక్కించాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు జరిగిన వింత అనుభవం గురించి తెలిపింది. తన తల్లితో కలిసి హోటల్లో  ఉన్నప్పుడు ఓ ఆత్మ లాంటి రూపం చూసిందట.

అయితే ఆ ఆత్మ లైట్ వేయగానే కనిపించలేదని తెలిపింది. తర్వాత ఏం జరిగిందనే విషయాన్ని కూడా బయటపెట్టింది ముద్దుగుమ్మ.

అన్నగారు వస్తారు షూటింగ్ స్టార్ట్ కావడానికి ముందు రోజు రాత్రి మా అమ్మతో కలిసి ఓ హోటల్ గదిలో ఉన్నాను. అప్పుడు అక్కడే ఓ ఆత్మను చూశాను.

మేం లైట్ వేయగానే పెద్ద సౌండ్ వచ్చింది. ఆ తర్వాత ఆత్మ కనిపించలేదు" అని తెలిపింది. మరి అది నాకు సాయం చేయడానికి వచ్చిందో లేదా నేను చేస్తున్న ప్రాక్టీస్ వల్ల వచ్చిందో తెలియదు.

నాకు ముందు నుంచి ఆత్మలపై నమ్మకం ఉంది. నేను తుళు జాతికి చెందిన అమ్మాయిని. మా పూర్వీకులను దేవతలుగా పూజిస్తాం. వాళ్లు మమ్మల్ని ఎప్పుడు కాపాడుతుంటారు అని చెప్పుకొచ్చింది.