AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏంది సామీ ఇదీ.. నువ్వు నేతవా.. మాంత్రికుడివా

ఏంది సామీ ఇదీ.. నువ్వు నేతవా.. మాంత్రికుడివా

Phani CH
|

Updated on: Dec 08, 2025 | 3:42 PM

Share

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో మాజీ సర్పంచ్ నాగరాజుపై క్షుద్రపూజల ఆరోపణలు కలకలం రేపాయి. రాజకీయ నాయకుడిగా చలామణి అవుతూ, రాత్రుల్లో తాంత్రిక పూజలు చేస్తున్నాడని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అమాయక గిరిజనులను మభ్యపెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్న నాగరాజుపై చర్యలు తీసుకోవాలని, మూఢనమ్మకాలపై అవగాహన కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో క్షుద్రపూజల ఘటన కలకలం రేపుతోంది. మండలంలోని కొమ్ముగూడెం గ్రామంలో ఓ మాజీ సర్పంచ్ పగలు రాజకీయ నాయకుడిగా చెలామణి అవుతూ, రాత్రి సమయంలో క్షుద్రపూజలు చేస్తున్నట్టు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గిరిజన ప్రజల అమాయకత్వాన్ని సొమ్ముచేసుకోవడానికి నారపోగు నాగరాజు అనే మాజీ సర్పంచ్ తాంత్రిక పూజలు చేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నాడని గ్రామస్తులు వాపోతున్నారు. తాంత్రిక విద్యలతో గాలిలో నిమ్మకాయలు నిలబెడుతూ అమాయక గిరిజనులను మభ్యపెట్టడమే కాకుండా ఓ క్షుద్రపూజలు చేసే మాంత్రికుడిని తీసుకొచ్చి పూజలు చేస్తున్నట్టు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్నం రాసులపై జంతువుల మాంసం పెట్టి రక్త తర్పణాలు చేసి క్షుద్ర శక్తులను ఆధీనంలోకి తీసుకుంటామని చెబుతూ మాంత్రికుడితో పూజలు చేయిస్తున్నట్టు తెలియడంతో గ్రామస్తులు మరింత భయాందోళన లో వున్నారు. నాగరాజు గతంలో కూడా ఫేక్ పాస్ పుస్తకాల కేసులో జైలు శిక్ష అనుభవించి వచ్చాడని క్రిమినల్ మెంటాలిటీ కలిగిన ఈ నాగరాజు ఇప్పుడు క్షుద్ర పూజలు, మాయలు మంత్రాలు అంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అమాయక ప్రజలను మభ్యపెట్టి క్షుద్ర పూజలు చేస్తూ గ్రామస్తులను భయబ్రాంతులకు గురి చేస్తున్న వ్యక్తి పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రశాంతంగా ఉన్న తమ గ్రామంలో ఇటువంటి తాంత్రిక పూజలకు పాల్పడే వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, గ్రామాల్లో మూఢనమ్మకాల పై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని స్థానిక యువత కోరుకుంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అడ్డంగా దొరికిన అదనపు కలెక్టర్‌.. ఏం చేశాడంటే

రోడ్డుపక్కన గుట్టలు గుట్టలుగా ఏటీఎం కార్డులు

ఈ కోతులు సల్లగుండా సర్పంచ్‌ ఎన్నికలనే మార్చేశాయిగా

వరుస మరణాలతో వణుకు.. ఐదుకు చేరిన స్క్రబ్ టైఫస్ మృతులు

ఫోన్ మాన్పించాలని చెస్ నేర్పితే.. అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లను ఓడించాడు