ఆడపిల్ల పుడితే రూ.10 వేలు ఎఫ్‌డీ చేస్తా… పంచాయతీ పోరులో ఓ సర్పంచ్ అభ్యర్థి హామీ
పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులు వినూత్న హామీలతో ఓటర్లను ఆకర్షిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ సర్పంచ్ అభ్యర్థి గెలిస్తే గ్రామంలో పుట్టిన ప్రతి ఆడపిల్లకు రూ.10,000 ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తానని ప్రకటించారు. ఈ సామాజిక మార్పుకు, ఆడపిల్లల ఆర్థిక భద్రతకు ఉద్దేశించిన వినూత్న ప్రచారం చర్చనీయాంశంగా మారింది. పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు.
పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. కొందరు గ్రామాల్లో కోతుల పని పడతామని చెబుతుంటే..కొందరు టీవీ ఛానళ్లు, వైఫై ఫ్రీగా ఇప్పిస్తామంటున్నారు. ఏకంగా ఐదేళ్లు కటింగ్, షేవింగ్ ఫ్రీ అంటున్నారు మరో అభ్యర్ధి. ఈ క్రమంలో ఇంకో అడుగు ముందుకేసి ఆడపిల్ల పుడితే వారికి రూ.10 వేలు డిపాజిట్ చేస్తామని ప్రచారం చేస్తున్నాడు మరో అభ్యర్ధి. హామీ ఏదైనా అందరి లక్ష్యం ఒక్కటే.. సర్పంచ్‌గా గెలవడం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఒక్కొక్కరు తమదైన శైలిలో ఓటర్లకు వాగ్దానాలు చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆరేపల్లి లో కాంగ్రెస్ అభ్యర్థి ఇటిక్యాల రాజు వినూత్నమైన అంశంతో ప్రజలతో మమేకమవుతున్నారు. ‘ గ్రామంలో ఆడపిల్ల పుడితే తల్లిదండ్రుల ముఖం పై సంతోషం కనిపించాలి కానీ భారంగా భావించకూడదు. అందుకే సర్పంచ్‌గా గెలిస్తే… పుట్టిన ప్రతి ఆడపిల్లకు రూ.10,000 ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తా’అని హామీ ఇచ్చాడు. ఎన్నికల్లో హామీలు చాలా వింటాం కానీ సమాజంలో మార్పు తీసుకురావాలని చేసే ప్రయత్నాలు మాత్రం అరుదు. ఆడపిల్ల పుట్టినా ఆనందం..ఆ ఆనందానికి ఆర్థిక రక్షణ ఇవ్వాలన్న సంకల్పం చ చర్చనీయాంశంగా మారింది. ఈ వినూత్న ప్రచారానికి ఓటర్లు ఎలా స్పందిస్తారో చూడాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏంది సామీ ఇదీ.. నువ్వు నేతవా.. మాంత్రికుడివా
అడ్డంగా దొరికిన అదనపు కలెక్టర్.. ఏం చేశాడంటే
రోడ్డుపక్కన గుట్టలు గుట్టలుగా ఏటీఎం కార్డులు
ఆడపిల్ల పుడితే రూ.10 వేలు ఎఫ్‌డీ చేస్తా... సర్పంచ్ అభ్యర్థి హామీ
ఏంది సామీ ఇదీ.. నువ్వు నేతవా.. మాంత్రికుడివా
రోడ్డుపక్కన గుట్టలు గుట్టలుగా ఏటీఎం కార్డులు
ఈ కోతులు సల్లగుండా సర్పంచ్ ఎన్నికలనే మార్చేశాయిగా
ఫోన్ మాన్పించాలని చెస్ నేర్పితే.. చివరికి
దారుణం.. తనకంటే అందంగా ఉన్నారని.. అలా ఎలా చేసింది.. బాబోయ్
బాబోయ్.. ప్రసూతి ఆస్పత్రిలో ఎలుకలు

