AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అడ్డంగా దొరికిన అదనపు కలెక్టర్‌.. ఏం చేశాడంటే

Phani CH
|

Updated on: Dec 08, 2025 | 3:38 PM

Share

హనుమకొండ అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి ప్రైవేట్ స్కూల్ రెన్యూవల్ కోసం ₹60 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఏసీబీ సోదాల్లో ₹30 లక్షల నగదుతో పాటు భారీ అక్రమాస్తులు బయటపడ్డాయి. ఇద్దరు విద్యాశాఖ అధికారులనూ అరెస్టు చేశారు. బాధితులు, ప్రజలు ఆయన అరెస్టును సంబరాలు చేసుకున్నారు. ఇది అవినీతిపై కీలక విజయం.

సీసీ కెమెరాలు లేకుండా చూసి లంచం తీసుకున్నాడు. అయినా ఏసీబీ అధికారుల నుండి తప్పించుకోలేకపోయాడు. పక్కా ప్లాన్ ప్రకారం 60 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ACBకి పట్టుబడ్డ హనుమకొండ అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ బృందానికి అక్కడ గుట్టల కొద్దీ కరెన్సీ కట్టలు కనిపించటంతో వారు షాక్ అయ్యారు. అతను అద్దెకు ఉంటున్న ఇంట్లో కనిపించిన మొత్తం కరెన్సీని లెక్కించగా రూ. 30 లక్షలుగా లెక్కతేలింది. ఆ డబ్బుకు సరైన ఆధారాలు చూపకపోవడంతో సీజ్ చేశారు. హైదరాబాద్ లోని స్వంత ఇంటితో పాటు, బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు బారీ ఎత్తున అక్రమఆస్తులు గుర్తించారు. ఆ అడిషనల్ కలెక్టర్ తో సహా మరో ఇద్దరు విద్యాశాఖ అధికారులను ఏసీబీ కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించారు. ఐతే ఆయన అరెస్ట్ నేపథ్యంలో బాధితులు సంబరాలు జరుపుకున్నారు. హనుమకొండ కలెక్టరేట్ ముందు టపాసులు కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు. రేపో మాపో IAS గా అర్హత పొందబోతున్న ఆ అధికారి..ఓ ప్రైవేట్ స్కూల్ రెన్యువల్ చేసేందుకు స్కూల్ యాజమన్యం నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వెంకట్ రెడ్డి ప్రస్తుతం హనుమకొండ జిల్లా విద్యాశాఖ అధికారిగా కూడా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ప్రైవేట్ స్కూల్ రెన్యువల్ కోసం లంచం డిమాండ్ చేసి రూ.60 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు తన ఛాంబర్ లోనే పట్టుకున్నారు. వెంకట్ రెడ్డితో పాటు.. గౌస్, మనోజ్ అనే మరో ఇద్దరు విద్యాశాఖ సిబ్బందిని కూడా పట్టుకున్నారు. హైద్రాబాద్ లోని తన నివాసంలో విలువైన భూముల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి పైన గతంలో కూడా పలు కేసులు నమోదు అయ్యాయి. ఆదాయానికి మించి అక్రమాస్తులు కలిగి ఉన్నాడనే ఆరోపణల పైన కేసులు ఉన్నాయనీ ఏసీబీ అధికారులు తెలిపారు.. నల్గొండ జిల్లాలో తహసీల్దార్ గా పనిచేసిన సమయంలో ఈయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. జనగామ RDO గా విధులు నిర్వహిస్తున్న క్రమంలో జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డు విషయంలో కూడా అవినీతి కి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రోడ్డుపక్కన గుట్టలు గుట్టలుగా ఏటీఎం కార్డులు

ఈ కోతులు సల్లగుండా సర్పంచ్‌ ఎన్నికలనే మార్చేశాయిగా

వరుస మరణాలతో వణుకు.. ఐదుకు చేరిన స్క్రబ్ టైఫస్ మృతులు

ఫోన్ మాన్పించాలని చెస్ నేర్పితే.. అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లను ఓడించాడు

దారుణం.. తనకంటే అందంగా ఉన్నారని.. అలా ఎలా చేసింది.. బాబోయ్