AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అదిలాబాద్‌ మీదుగా బీహార్‌కు ఏకశిలా మహా శివలింగం

Phani CH
|

Updated on: Dec 08, 2025 | 3:54 PM

Share

తమిళనాడులోని మహాబలిపురం నుండి బీహార్‌లోని చంపారన్‌కు తరలిస్తున్న 33 అడుగుల ఏకశిలా సహస్ర లింగం తెలంగాణకు చేరుకుంది. విరాట్ రామాయణ మందిరం కోసం భారీ వాహనంలో వెళుతున్న ఈ మహా శివలింగం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ వద్ద ఆగింది. దారిపొడవునా భక్తులు విశేషంగా దర్శించుకుంటూ పారవశ్యం చెందుతున్నారు. ఇది ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక మహత్తర ఘట్టం.

బీహార్‌లోని చంపారన్‌లో కొలువుదీరేందుకు తమిళనాడులోని మహాబలిపురం నుండి బయలుదేరిన ఏకశిలా సహస్ర లింగం తెలంగాణకు చేరుకుంది. బీహార్ రాష్ట్రానికి భారీ వాహనంలో వెళుతున్న ఈ ఏకశిలా మహా శివలింగం ఆదివారం ఆదిలాబాద్ జిల్లా కు చేరుకుంది. జాతీయ రహదారి 44 గుండా బీహార్ కు వెళుతుండగా మార్గమధ్యంలో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ వద్ద ఆగింది. దీంతో పెద్ద ఎత్తున ప్రజలు పెద్ద ఎత్తున తలరి వచ్చి మహా సహస్ర లింగాన్ని దర్శించుకుని తన్మయత్వం పొందారు. 33 అడుగుల ఏకశిలా మహాశివ లింగం తమిళనాడులోని మహాబలిపురం పట్టికాడు గ్రామం నుంచి పొడవైన వాహనంలో బిహార్ లోని పాట్నా జిల్లా చంపారానికి తరలిస్తున్నారు. అక్కడ ప్రతిష్టాత్మకంగా నిర్మించబోయే విరాట్ రామాయణ మందిరం కోసం ఈ విగ్రహాన్ని తీసుకెళ్తున్నారు. జాతీయ రహదారి గుండా రోజుకు 20 కిలోమీటర్ల చొప్పున ప్రయాణిస్తూ సాగుతోంది ఈ మహా శివలింగం. ముందు భాగంలో ఓంనమఃశివాయ అని రాసిఉన్న పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూ సహస్ర మహాశిలింగాన్ని దర్శిస్తూ భక్తులు పారవశ్యంలో మునిగిపోయారు. తమిళనాడు నుండి ఆదిలాబాద్ జిల్లా చేరుకునేందుకు 15 రోజులు పట్టిందని, బీహార్ పాట్నా జిల్లాకు వెళ్లే చేరడానికి మరో 25 రోజులు పడుతుందని మహాశివలింగం ఇంచార్జి అరుణ్ కుమార్ తెలిపారు. రోజుకు 15 నుండి 25 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నామని, దారిపొడవున ప్రజల నుండి విశేఫ ఆదరణ లభిస్తుందని తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆడపిల్ల పుడితే రూ.10 వేలు ఎఫ్‌డీ చేస్తా… పంచాయతీ పోరులో ఓ సర్పంచ్ అభ్యర్థి హామీ

ఏంది సామీ ఇదీ.. నువ్వు నేతవా.. మాంత్రికుడివా

అడ్డంగా దొరికిన అదనపు కలెక్టర్‌.. ఏం చేశాడంటే

రోడ్డుపక్కన గుట్టలు గుట్టలుగా ఏటీఎం కార్డులు

ఈ కోతులు సల్లగుండా సర్పంచ్‌ ఎన్నికలనే మార్చేశాయిగా