తమిళనాడులోని మహాబలిపురం నుండి బీహార్‌లోని చంపారన్‌కు తరలిస్తున్న ఏకశిలా మహా శివలింగం తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాకు చేరుకుంది. జాతీయ రహదారి 44 గుండా ప్రయాణిస్తున్న ఈ శివలింగం ఇచ్చోడ వద్ద ఆగింది. విరాట్ రామాయణ మందిరం కోసం తరలిస్తున్న ఈ శివలింగాన్ని దర్శించుకోవడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి భక్తిపారవశ్యంతో ఉన్నారు.