Gold Investment: బంగారంలో పెట్టుబడి పెట్టేవారికి బిగ్ అలర్ట్.. ఈ పని చేస్తే మీకే నష్టం
బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో సామాన్యులు గోల్డ్ కొనాలంటేనే భయపడుతున్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాలు, యుద్దాలతో ఈ ఏడాదిలో బంగారం ధర ఆమాంతం పెరిగింది. రానున్న కొద్ది నెలల్లో మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకుంటే..

బంగారం ధరలు బ్రేకులు లేకుండా భారీగా పెరుగుతున్నాయి. తులం బంగారం ఈ ఏడాదిలో ఏకంగా లక్షన్నరకు చేరుకోగా.. వచ్చే ఏడాది నాటికి 30 శాతం వరకు పెరిగే అవకాశముందని బిజినెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారు ఎక్కువైపోయారు. అంతర్జాతీయంగా ఆర్ధిక అస్ధిరతతో స్టాక్ మార్కెట్లు కంటే బంగారంపై పెట్టుబడులు పెట్టడం సురక్షితంగా భావిస్తున్నారు. బంగారం రేట్లు పెరగడానికి ఇదొక కారణమవుతోంది. నేరుగా బంగారం కొనుగోలు చేసి చాలామంది దాచుకుంటూ ఉంటారు. ఇక గోల్డ్ ఈటీఎఫ్‌లలో కొంతమంది ఇన్వెస్ట్ చేస్తే.. మరికొంతమంది బంగారు నాణెలు కొనుగోలు చేస్తూ ఉంటారు.
గోల్డ్ ఈటీఎఫ్‌లు బెటర్
అయితే బంగారు ఆభరణాలు నిజమైన కొనుగోలు ధరలో 60 నుంచి 70 శాత్రమే అని కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు కో-చైర్మన్ సంజీవ్ ప్రసాద్ చెబుతున్నారు. అందులోని మిశ్రమలోహాలు, వజ్రాల పనితీరు మందకొడిగా ఉండటం వల్ల భవిష్యత్తుల్లో అమ్మాలంటే రేటు తగ్గుతుంది. ఇక ప్రాసెసింగ్ ఫీజు, విలువైన మిశ్రమాలు నష్టపోవడం వల్ల మీరు కొన్నప్పుడు కంటే బంగారం రేటు విక్రయించాలనుకున్నప్పుడు తగ్గుతుంది. వీటి వల్ల మీకు బంగారంపై అధికా రాబడి లభించదు. దీనికి బదులుగా గోల్డ్ ETFలలో పెట్టుబడి పెట్టడం మంచి మార్గమని చెబుతున్నారు. లేదా బంగారు నాణేలు, బార్‌ల వంటి ప్రత్యక్ష పెట్టుబడులు మంచివని అంటున్నారు.
గోల్డ్ ఈటీఎఫ్‌లు
ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్స్‌లో అనేక గోల్డ్ ఈటీఎఫ్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో మీరు నెలనెలా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ రూపంలో పెట్టుబడి పెట్టవచ్చు. దీని వల్ల మీరు డబ్బులు పొదుపు చేసుకోవడంతో పాటు భవిష్యత్తులో అధిక రాబడి పొందవచ్చు. చాలమంది ఇప్పుడు వీటిల్లోనే పెట్టుబడి పెడుతున్నారు. ఫిజికల్ గోల్డ్ కంటే వీటిల్లో ఇన్వెస్ట్ చేయడం మీకు సులువుగా ఉంటుంది.




