AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Holidays List: 2026లో తెలంగాణ ప్రభుత్వ సెలవులు ఇవే.. లిస్ట్ రిలీజ్..

కొత్త ఏడాది వస్తున్న క్రమంలో 2026 సెలవుల లిస్ట్‌ను తెలంగాణ ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ప్రతీ సంవత్సరం ముందుగానే హాలీడే లిస్ట్‌ను ప్రభుత్వం విడుదల చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా వచ్చే ఏడాది సెలవులను ప్రకటించింది. ఆ లిస్ట్ ఎలా ఉందంటే..

Telangana Holidays List: 2026లో తెలంగాణ ప్రభుత్వ సెలవులు ఇవే.. లిస్ట్ రిలీజ్..
Telangana
Venkatrao Lella
|

Updated on: Dec 08, 2025 | 10:01 PM

Share

కొత్త సంవత్సరం మరికొద్ది రోజుల్లో రానున్న క్రమంలో తెలంగాణ ప్రభుత్వం 2026 సెలవుల లిస్ట్‌ను సోమవారం విడుదల చేసింది. సాధారణ, ఆప్షనల్ హాలీడే లిస్ట్‌ను రిలీజ్ చేసింది. 2026లో మొత్తం 27 సాధారణ సెలవులు, 26 ఆప్షనల్ సెలవులను ఖరారు చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు జీవో నెంబర్ 1715తో ఉత్తర్వులు జారీ చేశారు.

సెలవులు ఇవే..

జవవరి 14వ తేదీన భోగి, 15న సంక్రాంతి సెలవులు ప్రకటించగా.. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సెలవు కేటాయించింది. ఇక ఫిబ్రవరి విషయానికొస్తే.. 15వ తేదీన మహాశివరాత్రి, మార్చి 3వ తేదీన హోలీ, 19న ఉగాది, 21న రంజాన్, 22న రంజాన్ తర్వాతి రోజు, 27న శ్రీరామనవమి సెలవులు ప్రకటించింది. ఏప్రిల్‌లో 3న గుడ్ ఫ్రైడే, 5న బాబు జగ్జీవన్ రామ్ జయంతి, 14న అంబేద్కర్ జయంతి సెలవులు కేటాయించింది. ఇక మేలో 27న బక్రీద్, ఆగస్టు 10న బోనాలు, సెప్టెంబర్ 14న వినాయకచవితి, అక్టోబర్ 18న సద్దుల బతుకమ్మ, అక్టోబర్ 20వ తేదీన విజయదశమి సెలవులు ఇచ్చింది..ఇక నవంబర్ 8న దీపావళి, 24న కార్తీక పౌర్ణమి, డిసెంబర్ 25న క్రిస్మస్ హాలీడే ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.